- తాడికొండ రాజయ్యకు టికెట్ నిరాకరించిన కేసీఆర్
- పార్టీ మారే యోచనలో రాజయ్య ఉన్నారంటూ వార్తలు
- రాజయ్య ఇంటికి వెళ్లి బుజ్జగించిన దాస్యం వినయ్ భాస్కర్
స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ టికెట్ ను తనకు కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేసీఆర్ ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ మారే యోచనలో రాజయ్య ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ సూచన మేరకు రాజయ్య ఇంటికి ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు. అసంతృప్తితో ఉన్న రాజయ్యను బుజ్జగించారు. దీంతో రాజయ్య మెత్తబడినట్టు, పార్టీ మారే ఆలోచనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.
టికెట్ ప్రకటించిన రోజున పెద్దగా తన అసంతృప్తిని వెల్లడించని తాటికొండ రాజయ్య ,తరవాత అసంతృప్తి స్వరం వినిపించారు .అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని బోరున విలపించారు .వరంగల్ వచ్చిన కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహాను కలిసి మంతనాలు జరిపారు ..దీంతో రాజనరసింహ తో భేటీలో పార్టీ మార్పు గురించి చర్చ జరిగినట్లు వార్తలు రావడంతో బీఆర్ యస్ నేతలు రంగంలోకి దిగారు ..ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య పార్టీ మారితే పార్టీకి నష్టం జరుగుందని గ్రహించిన కేసీఆర్ దాస్యం వినయ్ భాస్కర్ కు రాజయ్యను బుజ్జగించే భాద్యతను అప్పగించారు ..మొత్తానికి వినయ్ భాస్కర్ మాటలతో మెత్తబడ్డ అది తాత్కాలికమేనని అంటున్నారు పరిశీలకులు …