ఆంధ్రప్రదేశ్

వామ్మో పులస.. రూ.26 వేలకు కొన్న రాజకీయ నాయకుడు!

  • యానాం పుష్కరఘాట్ వద్ద మత్స్యకారుడి వలకు చిక్కిన పులస
  • వేలంలో రూ. 19 వేలకు దక్కించుకున్న మహిళ
  • ఆ తర్వాత ఆమె నుంచి ఓ రాజకీయ నాయకుడి కోసం కొనుగోలు

అత్యంత రుచికరమైన చేపగా పేరుకెక్కిన పులస మళ్లీ రికార్డు స్థాయి ధర పలికింది. నిన్న సాయంత్రం యానాం పుష్కరఘాట్ వద్ద ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన పులస అతడి పంట పండించింది. రెండు కిలోల బరువున్న ఈ చేపను వేలం వేయగా నాగలక్ష్మి అనే మహిళ రూ. 19 వేలకు కొనుగోలు చేశారు. 

ఆ తర్వాత రావులపాలెంకు చెందిన ప్రముఖ నాయకుడి కోసం ఓ వ్యక్తి ఆమె నుంచి రూ. 26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. గోదావరికి ఎదురీదే పులస అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతారు. దీనికి తోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేపను కొనేందుకు పోటీపడుతుంటారు.

Related posts

పొరపాటున సొంత నగరంపైనే బాంబుల వర్షం కురిపించిన రష్యా యుద్ధ విమానం…

Drukpadam

పాక్‌లో హైడ్రామా!.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ మ‌రోమారు వాయిదా!

Drukpadam

జోగులాంబ ఆలయ హుండీలో రూ.100 కోట్ల చెక్కు కలకలం….

Drukpadam