Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మంత్రి అజయ్ కుమార్ పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నిప్పులు …

మంత్రి అజయ్ కు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వార్నింగ్ …! పువ్వాడ డౌన్ ,డౌన్ అంటూ నినదించిన ఎమ్మెల్యే …
నా నియోజకవర్గ పథకాల్లో మంత్రి జోక్యం ఏమిటి …?
దళితబంధు లో మంత్రి పెత్తనం పై ఆగ్రహం
కేసీఆర్ ,కేటీఆర్ రాజు ,యువరాజు అయితే ..జిల్లామంత్రి సమంత రాజుల వ్యవహరిస్తున్నారు

ఖమ్మం జిల్లా బీఆర్ యస్ వర్గపోరు భగ్గుమన్నది ….. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ జిల్లామంత్రి పువ్వాడ అజయ్ పై నేడు వైరాలో జరిగిన సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమ సభలో ఘాటు విమర్శలు చేశారు . తన నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఏమిటి ..? అంటూ ఫైర్ అయ్యారు . సీఎం కేసీఆర్ రాజు అయితే కేటీఆర్ యువరాజుగా , మంత్రి పువ్వాడ అజయ్ సమంత రాజుల వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . దళితబంధు విషయంలో కొంతమందికి దళిత బంధు వస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు . ఆమేరకు వారి వద్ద నుంచి కొన్ని నిధులు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రి తన నియోజకవర్గంలో వేలుపెట్టడంపై గరం గరం అయ్యారు …మంత్రి అజయ్ ఉమ్మడి జిల్లాలో తనకు ఒక్కడినే గెలవాలనే దురుద్దేశం ఉన్నారని విమర్శలు గుప్పించారు … వేదిక మీదనే మంత్రి అజయ్ డౌన్ డౌన్ అంటూ స్వయంగా ఎమ్మెల్యే నినదించడం అక్కడ ఉన్నవారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎన్నడూ లేని విధంగా ఎన్నిఅలా ముందు ఒక ఎమ్మెల్యే మంత్రిపై చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రకటించిన బీఆర్ యస్ అభ్యర్థుల జాబితాలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కు టికెట్ రాలేదు … అసలే టికెట్ రాకుండా ఉండటంలో రగిలి పోతున్న రాములు నాయక్ తనకు టికెట్ రాకపోవడానికి మంత్రి అజయ్ కుమార్ కారణమని భావిస్తున్న రాములు నాయక్ అగ్గిమీద గుగ్గులం అయ్యారు . జిల్లాలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే మంత్రి అజయ్ పై ఇంతటి తీవ్ర విమర్శలు చేయలేదు … జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ యస్ నేతల మధ్య సమన్వయ లోపం రానున్న ఎన్నికల్లో బూమ్ రంగ్ అయ్యే ప్రమాదమున్నది బీఆర్ యస్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. గుట్టుగా ఉన్న వర్గ విభేదాలు బయటపడటం వైరా ఎమ్మెల్యే మంత్రి అజయ్ డౌన్ డౌన్ అంటూ నినదించడం బీఆర్ యస్ అంతర్గత కలహాలను రచ్చకు వీడ్చినట్లు అయింది.. బీఆర్ యస్ లో రగిలిపోతున్నఅసమ్మతి బహిర్గతం అయింది..

ఖమ్మం జిల్లాలో ఈసారి ఎక్కువ సీట్లు గెలవాలని అనుకున్న బీఆర్ యస్ కు ఎమ్మెల్యే వ్యాఖ్యలు శరాఘాతంగా మారాయని పరిశీలకుల అభిప్రాయం …జిల్లా బీఆర్ యస్ కొందరు ప్రజాప్రనిధులు సైతం మంత్రి వైఖరిపై గుర్రుగా ఉన్నారు … అనేక మంది బీఆర్ యస్ సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత నష్టం కలిగించేలా ఉన్నాయి…

Related posts

శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు…మంత్రి పొంగులేటి

Ram Narayana

పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ ఖాయం : సీపీఐ నేత కూనంనేని

Ram Narayana

వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…

Ram Narayana

Leave a Comment