- కేసీఆర్‌పై మరోమారు విమర్శలు గుప్పించిన ఈటల రాజేందర్
- రాములు నాయక్ గిరిజనుడు, పేదవాడు కావడంతోనే ఆయనకు టికెట్ నిరాకరించారన్న బీజేపీ నేత
- బీఆర్ఎస్ఎలో ఎవరి పరిస్థితి అయినా ఇంతేనన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోమారు ఫైరయ్యారు. వైరాలో నిన్న నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఎవరినైనా మోసం చేయగలడని, వైరా ఎమ్మెల్యే ప్రస్తుత పరిస్థితే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. గిరిజనుడు, పేదవాడు, నోట్లో నాలుకలేనివాడు కావడంతోనే రాములు నాయక్‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని విమర్శించారు.
మరో రెండుమూడు నెలల అధికార సమయం ఉన్నా ఆయన అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైరా ప్రస్తుత అభ్యర్థి మదన్‌లాల్.. తాను కలిసి హాస్టల్‌లో చదువుకున్నామని గుర్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రగతి భవన్‌కు వెళ్లలేకపోతున్నానని తన వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారని, కేసీఆర్ వద్ద ఎవరి పరిస్థితైనా ఇంతేనని రాజేందర్ విమర్శించారు.