- హైకోర్టు తీర్పును సవాల్ చేసిన కృష్ణమోహన్ రెడ్డి
- హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకీ, ప్రతివాదులకు ఆదేశాలు
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాగా, తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు ఇప్పటికే బీజేపీ నాయకురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలను ఇచ్చింది. కానీ కృష్ణమోహన్ రెడ్డి అప్పీల్‌కు వెళ్లారు. మరోవైపు కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే ఆరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.