Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణాలో ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్…ఖమ్మం జిల్లాకు ప్రియాంక గాంధీ..!

తెలంగాణాలో ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్…ఖమ్మం జిల్లాకు ప్రియాంక గాంధీ..!
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సిడబ్ల్యుసి సభ్యులు
బీజేపీకి బీటీమ్ బీఆర్ యస్ …బీజేపీ కాపిటలిస్టుల పార్టీ …బీఆర్ యస్ ఫ్యూడలిస్టుల పార్టీ
బీఆర్ యస్ పై ఛార్జ్ షీట్ …
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఈ నెల 17న కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించే గ్యారెంటీ కార్డు ప్రకటనలను 18న సిడబ్ల్యుసి సభ్యులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ ప్రకటించిన పలు స్కింల గ్యారెంటీ కార్డు ప్రకటనలు 2023- 24 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా అమలు చేస్తామన్న భరోసా కల్పించేందుకు ప్రజల వద్దకు వెళుతున్నామని తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు … కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం పూర్తి అయిన తరువాత ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు ఆరీఫ్ నసీమ్ ఖాన్ తో కలిసి భట్టి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ వరకు బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, వైఫల్యాలు, సంపద లూటీ, ఆర్థిక దోపిడీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆధారాలతో కూడిన వివరాలతో చార్జీషీట్ పూర్తి చేస్తామన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కాదు రెండు ఒకటేనని , రాష్ట్రంలో బిఆర్ఎస్ కు బీటీం బిజెపి అన్నారు. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకువచ్చిన అనేక బిల్లులకు బిఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారని, బిజెపిని సమర్థించిన బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టుగానే అవుతుంది భట్టి తెలియజేశారు. ప్రభుత్వ వ్యవస్థలు, ఆస్తులు అమ్మేస్తున్న బిజెపి, ప్రభుత్వ భూములు అమ్ముతూ.. అప్పులు చేస్తున్న బిఆర్ఎస్ నుంచి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ మాత్రమే కాపాడగలుగుతుందన్నారు. కాంగ్రెస్ ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్(ఖమ్మం), ఎమ్మెల్యే పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం), మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు , నగర అధ్యక్షుడు జావీద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి…ఎంపీ నామ

Ram Narayana

కేసీఆర్ దిగజారి అబద్దాలు మాట్లాడుతున్నారు …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

 డిసెంబర్ 9 తర్వాత నీ సంగతి చూస్తాం: బోధన్ ఏసీపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్

Ram Narayana

Leave a Comment