- సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట అప్రూవర్‌గా మారినట్లు వార్తలు
- ఇటీవలే ఆయన ఆస్తులను అటాచ్ చేసిన దర్యాఫ్తు సంస్థ
- గతంలోను అప్రూవర్‌గా మారి, ఉపసంహరించుకున్న పిళ్లై
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దర్యాఫ్తు సంస్థ ఆయన ఆస్తులను ఇటీవల అటాచ్ చేసింది. పిళ్లై గతంలోను అప్రూవర్‌గా మారి, ఆ తర్వాత మాటమార్చారు. ఈడీ తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకుందని కోర్టుకు వెళ్లారు. ఆ వాంగ్మూలాలను వెనక్కి తీసుకున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రామచంద్రపిళ్లైని ఈ ఏడాది మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది.