Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు 13చోట్ల సంతకాలు పెట్టారు: సీఐడీ చీఫ్ సంజయ్

  • నిబంధనలు పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారన్న సీఐడీ చీఫ్
  • రూ.241 కోట్లు నేరుగా ఒక  కంపెనీకి  వెళ్లడం కీలకమని వ్యాఖ్య
  • చాలాచోట్ల అప్రూవల్స్  కోసం చంద్రబాబు సంతకం ఉందన్న  ఏపీ సీఐడీ చీఫ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాడు నిబంధనలను పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… కార్పోరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదన్నారు. ప్రయివేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించారన్నారు. ఈ డిపార్టుమెంట్ నేరుగా చంద్రబాబుతో సంప్రదించేలా ప్లాన్ చేశారన్నారు. జీవోల్లో పదమూడుచోట్ల టీడీపీ అధినేత సంతకాలు ఉన్నట్లు తెలిపారు. బడ్జెట్ అనుమతి, కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన సంతకమే ఉందన్నారు. సిమెన్స్ ద్వారా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంవోయూలో లేదన్నారు.

తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆడిటర్‌ను కార్పొరేషన్‌కు ఆడిటర్‌గా నియమించారన్నారు. సాధారణంగా కేబినెట్‌ ఆమోదంతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తారని, కానీ, ఇక్కడ జీవో ద్వారా చేశారన్నారు. రూ.241 కోట్లు నేరుగా ఒక కంపెనీ కి అక్కడి నుండి  షెల్ కంపెనీలకు వెళ్లాయని, ఈ కేసులో ఇది చాలా కీలకమన్నారు. ఈ స్కామ్‌పై జర్మనీలోని సీమెన్స్‌ యాజమాన్యం కూడా స్పందించినట్లు చెప్పారు. భారత్‌లోని తమ ఉద్యోగులు తమకు వాస్తవాలు చెప్పకుండా దాచినట్లు సీమెన్స్ తెలిపిందన్నారు. కార్పోరేషన్ నుంచి కొంత డబ్బు బయటకు వెళ్లిందని, ప్రయివేటు వ్యక్తుల నుండి నకిలీ ఇన్వాయిస్‌లుగా మారాయన్నారు.

స్కిల్ కేసులో రిమాండ్ తర్వాత కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాళ్లందరికీ ఒక్కటే సమాధానమని, ఆ కార్పోరేషన్ ద్వారా హవాలా నిధులు దారి మళ్లాయన్నారు. సీమెన్స్, డిజైన్ టెక్ ద్వారా… చంద్రబాబు ప్రోద్భలంతో నిధులు మళ్లాయన్నారు. కేసులో ఏ37ను ఏ1గా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారని, ఇది హాస్యాస్పదమన్నారు. 13 చోట్ల సంతకాలు చేశారన్నారు. నిధులు విడుదల చేయాలని, చార్టర్డ్ అకౌంటెంట్‌ను నియమించాలని, డీప్యూటీ సీఈవో అపర్ణ నియామకంలో, కేబినెట్ సమావేశం మినట్స్‌లో… ఇలా అన్నింటా చంద్రబాబు సంతకం ఉందని తెలిపారు. ఇందులో దురుద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Related posts

Drukpadam

ఒమిక్రాన్ పై అప్రమత్తత…తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

Drukpadam

బెంగళూరులో ముగిసిన విపక్ష నేతల సమావేశం… రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయం

Drukpadam

Leave a Comment