Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

చంద్రబాబు అరెస్ట్ పై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఏపీలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అన్న హరీశ్
  • దీంతో బీఆర్ఎస్ కు సంబంధం లేదన్న టీఎస్ మంత్రి
  • చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్య

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని అన్నారు. దాంతో బీఆర్ఎస్ కు సంబంధం లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు స్పందించారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెలంగాణలో కూడా పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న హైదరాబాద్ విప్రో సర్కిల్ లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

Related posts

మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం… టీవీ నటి పవిత్ర దుర్మరణం..

Ram Narayana

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

Ram Narayana

చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు! హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకూ కార్ల ర్యాలీ

Ram Narayana

Leave a Comment