- భయాందోళనకు గురై చైన్ లాగిన ప్రయాణికులు
- గుంటూరు బైపాస్ దాటిన తర్వాత దాదాపు మూడు గంటలు నిలిచిన రైలు
- దాదాపు తొమ్మిది గంటలకు తిరిగి బయలుదేరిన రైలు
సికింద్రాబాద్ – రేపల్లె రైలులో ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో గుంటూరు బైపాస్ దాటిన తర్వాత నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి రేపల్లెకు బయలుదేరింది. రైలు నుంచి ఒక్కసారిగా శబ్ధాలు రావడంతో పాటు నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారు. దీంతో రైలు దాదాపు మూడు గంటలు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే రైలు రాత్రి 10 గంటలకు రేపల్లె నుంచి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది. 3 గంటలకు పైగా ఆలస్యంగా రేపల్లెకు చేరుకున్న రైలు తిరిగి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది …దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు ..
Save or share this story as a newspaper-style Epaper Clip: