Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..
…తుక్కుగూడ సభలో రాహుల్ ధ్వజం
బీజేపీ , బీఆర్ యస్ , ఎంఐఎం పార్టీలు ఒక్కటే…వారిపై పోరాడుతున్నాం
కాంగ్రెస్ ను డిస్ట్రబ్ చేయడానికి బీజేపీకి ఉపయోగపడటమే వారి లక్ష్యం…

తెలంగాణాలో బీజేపీ , బీఆర్ యస్ , ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని …వారిపై పోరాడుతున్నాంమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు .విపక్ష నేతలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న మోడీ ప్రభుత్వం కేసీఆర్ , ఎంఐఎం నేతలపై కేసులు పెట్టడంలేదని వారి మధ్య ఉన్న రహస్య ఒప్పడమే ఇందుకు కారణమని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు . తెలంగాణ ఇచ్చింది ఒక్క ఫ్యామిలీ కోసం కాదని తెలంగాణ ప్రజల కోసమని స్పష్టం చేశారు . సోనియా గాంధీ చేసిన ఆరు గ్యారంటీ వాగ్దానాలు అములు చేసి తీరుతామని అన్నారు . కాంగ్రెస్ ను డిస్ట్రబ్ చేయడానికి బీఆర్ యస్ బీజేపీ , ఎమ్మెల్మ్ లు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు . ఈసారి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతామని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు . నాకు ముందు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ రైతులకు ,పేదలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని హామీ ఇచ్చారు . సభలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు . సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేయించిన అధికారులు ..

Ram Narayana

పితృస్వామ్యమే అడ్డుపడితే ఇందిరాగాంధీ ప్రధాని ఎలా కాగలిగారు?: నిర్మలా సీతారామన్

Ram Narayana

యూపీలో 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర…

Ram Narayana

Leave a Comment