Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. ఆపై ఇంటికి ఆహ్వానించి నిలువు దోపిడీ

  • ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఘటన
  • సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూ వీడియోలు, ఫొటోలు
  • ఆపై వాటిని చూపించి డబ్బులు, బంగారం గుంజుకొంటున్న ముఠా
  • ఇప్పటికే వారిపై మరిన్ని కేసులు
  • పేస్ బుక్ ద్వారా యువకులను ఎరవేసి దోపిడీ చేస్తున్న కిలాడీ దంపతులు …!

  • పేస్ బుక్ ద్వారా పరిచయం…ఆపై ఆహ్వానం …ఇంకేముందు ఎగేసుకుంటూ పరుగెత్తడం …ఆ తరువాత లబోదిబో …వారి వద్ద ఉన్న డబ్బు నగలు దోచుకోవడం తంతుగా మారింది…ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఒక జంటకు …వారి మాయలోపడిన యువకులు పలువురు కొంతకాలం ఎవరికీ చెప్పుకోలేక చెప్పితే తదగ్గర ఉన్న వీడియోలు బయట పెడతామని హెచ్చరికలతో ఉండటం వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది …ఆనోటా ఈ నోటా ఇది ప్రచారం కావడంతో వలపన్నిన పోలీసులు ఆ కిలాడి దంపతులను కటకటాలు పంపించారు

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ఆపై ఇంటికి ఆహ్వానించి యువకులను దోచుకుంటున్న ముఠాకు పోలీసులు సంకెళ్లు వేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన ఇరానీ పాత్ర్ ఆమె భర్త రవి పాత్ర్  ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తొలుత ఇరానీ పాత్ర్  ఫేస్‌బుక్‌‌లో తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్రెండ్ రిక్వెస్టులు పెడుతుంది. అవతలివారు అంగీకరించిన వెంటనే వారి ఫోన్ నంబర్ తీసుకుని  పరిచయం పెంచుకుని రెచ్చగొట్టే మెసేజ్‌లు పంపి ఇంటికి ఆహ్వానించేది. 

వచ్చిన వారిని గదిలోకి తీసుకెళ్లి సన్నిహితంగా ఉన్నట్టు నటించేది. అప్పటికే ఆ గదిలో రహస్యంగా ఉన్న వారు వీడియోలు, ఫొటోలు తీసేశారు. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగి వారి వద్దనున్న డబ్బు, బంగారం దోచుకునేవారు. అలాగే, భువనేశ్వర్‌కే చెందిన ఓ యువకుడి భార్యకు ఎయిమ్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 3.60 లక్షలు కాజేసినట్టు నిందితులపై మరో కేసు కూడా నమోదైంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts

స్కూల్లో టీచ‌ర్‌పై బ‌కెట్‌తో బ‌డి పిల్ల‌ల దాడి.. టీసీలు ఇచ్చి పంపించేసిన వైనం!

Drukpadam

తేలని వివేకా హత్యకేసు …కొనసాగుతున్న సిబిఐ విచారణ…

Drukpadam

తాలిబన్ల మరో కిరాతకం.. జానపద గాయకుడి హత్య!

Drukpadam

Leave a Comment