Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

 ఈ బిల్లు నాకు వ్యక్తిగతంగా భావోద్వేగంతో కూడుకున్నది: సోనియాగాంధీ

  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా నిలబడతానన్న సోనియా
  • వంటగది నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్య
  • ఈ బిల్లు ఆమోదం పొందితే రాజీవ్ కల నెరవేరుతుందన్న సోనియా

చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాను మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా నిలబడతానని చెప్పారు. వంటగది నుంచి ప్రపంచ స్థాయి వేదికల వరకు భారతీయ మహిళ పాత్ర ఎంతో ఉందని అన్నారు. భారత మహిళలు ఏనాడూ వారి స్వార్థం గురించి ఆలోచించరని… వారు చేసే త్యాగాలు వెలకట్టలేనివని చెప్పారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో సైతం మహిళలు గొప్ప పాత్రను పోషించారని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసిన మహిళలు కూడా ఎంతో కృషి చేశారని చెప్పారు. 

మహిళల రిజర్వేషన్ బిల్లు వ్యక్తిగతంగా తన జీవితంలో కూడా భావోద్వేగంతో కూడిన అంశమని సోనియా అన్నారు. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను తన భర్త రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని చెప్పారు. అయితే అప్పుడు రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఆ బిల్లు ఓడిపోయిందని… ఆ తర్వాత పీవీ నరసింహారావు హయాంలో రాజ్యసభ ఆమోదం పొందిందని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాజీవ్ గాంధీ కల నెరవేరుతుందని చెప్పారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు కల్పించే 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కూడా స్థానం కల్పించాలని కోరారు.

Related posts

అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి.. !

Ram Narayana

తెలంగాణ‌లో గూగుల్‌, యూట్యూబ్ ప్ర‌క‌ట‌న‌ల్లో బీజేపీ టాప్

Ram Narayana

యూపీలో గన్ కల్చర్ …పోలీసుల సమక్షంలోనే ఇద్దరు కాల్చివేత…!

Drukpadam

Leave a Comment