హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
బాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో క్వాష్ పిటిషన్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు నేడు విచారించారు . ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది . మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇచ్చారు . రేపు విచారణ కొనసాగనుంది. విచారణ సందర్భంగా చంద్రబాబుకు ప్రతి గంటకు 5 నిముషాలు టీ బ్రేక్ ఇచ్చారు . ఆయన తరుపున ఇద్దరు న్యాయవాదులకు కోర్ట్ అనుమతి ఇచ్చింది ..వారితో చంద్రబాబు సంపాదించుకునే అవకాశం కల్పించింది…సి ఐ డి అధికారుల బృందం ధనుంజయ ఆధ్వరంలో చంద్రబాబును విచారించింది. ఈ సందర్భంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది… అయితే ఏ ఏ ప్రశ్నలు అడిగారు . చంద్రబాబు ఎలాంటి సమాదానాలు ఇచ్చారు .అనేది బయటకు రాలేదు ..విచారణ అంతా వీడియో , ఆడియో రికార్డింగ్ చేశారు .