Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ….?తుమ్మలా…? పొంగులేటినా …??

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ….?తుమ్మలా…? పొంగులేటినా …??
నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకుని మైనార్టీ కోట నుంచి నాకే ఖమ్మం సీటు అంటున్న జావేద్…
ఖమ్మం ,పాలేరు నియోజకవర్గాల్లో పై కొనసాగుతున్నఉత్కంఠ
ప్రతినియోజకవర్గం నుంచి మూడు పేర్లు సెలెక్ట్ చేసిన స్క్రినింగ్ కమిటీ
ఇప్పటికి ఢిల్లీలో అభ్యర్థుల వడపోతపై సమావేశాలు
తిరిగి ఈనెల 27 ,28 తేదీల్లో సమావేశాలు …ఆరోజు లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం
ఫైనల్ లిస్ట్ ఏఐసీసీకి అందజేస్తారు …
అక్టోబర్ 1 లేదా 2 వ తేదీన ప్రకటించే అవకాశం ఉందని సమాచారం …

ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠత నెలకొన్నది …. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను తిరిగి బీఆర్ యస్ తన అభ్యర్థిగా ప్రకటించింది…ఆయన బలమైన అభ్యర్థిగా రంగంలో ఉండటంతో ఆయన్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచనలు చేస్తుంది …అందులో భాగంగా ఇటీవల కాంగ్రెస్ లో చేరినమాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఒకరు పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది…వారైతేనే ఇక్కడ బలమైన అభ్యర్థులుగా ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే ఇక్కడ నుంచి మైనార్టీ కోట ద్వారా తనకే టికెట్ వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేత జావేద్ ఆశలు పెట్టుకున్నారు . ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా , అంతకు ముందు ఎన్ ఎస్ యూ ఐ , యూత్ కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర నాయకుడిగా దశాబ్దాలుగా పార్టీ అప్పగించిన పనులు చేస్తున్న ప్రజల్లో తిరుగుతున్నాడు …తుమ్మల ,పొంగులేటిలు కాంగ్రెస్ లో చేరక ముందు వరకు జావేద్ పేరే కాంగ్రెస్ నుంచి వినిపించింది..అయితే వారు చేరిన తర్వాత జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి…తుమ్మల , పొంగులేటిలకు సీట్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది..దీంతో వారు కచ్చితంగా పోటీలో ఉంటారు …అయితే ఎవరు ఎక్కడ నుంచి ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది..

ఉమ్మడి జిల్లాలో జనరల్ సీట్లు మూడే ఉన్నాయి..పొంగులేటి మూడు సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు . తుమ్మల దరఖాస్తుల చేసే సమయం అయిపోయిన తర్వాత పార్టీలో చేరారు …ఏఐసీసీ తుమ్మల చేరికకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది… హైద్రాబాద్ లో జరిగిన సీడబ్ల్యూ సి సమావేశాల సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న తుమ్మల సోనియా , రాహుల్ , ప్రియాంక గాంధీ లను కలిశారు .కాంగ్రెస్ లో చేరిన తర్వాత తుమ్మలకు ఉత్సహపూరితంగా కనిపించి మంచి జోష్ మీద ఉన్నారు .ఏఐసీసీ సమావేశాల హోటల్ వద్ద బహిరంగ సభ దగ్గర తుమ్మలకు ప్రజలు అభివాదం చేశారు . అయన కూడా అదే రీతిలో స్పందించారు . ఒక సందర్భంలో కారులో నుంచి రెండు చేతులు ఊపుతూ ప్రజలకు రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తూ వెళ్లారు …ఆయన పాలేరు నుంచి పోటీచేయాలనే పట్టుదలతో ఉండగా , ఆయన్ను మాత్రం ఖమ్మం కు రావాలని ఆయన హితులు సన్నిహితులు కోరుతున్నారు . పొంగులేటి కూడా తుమ్మలను ఖమ్మంలో పోటీచేయాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది… అప్పుడు పొంగులేటి పాలేరు నుంచి పోటీచేస్తారని అంటున్నారు .అయితే అక్కడ నుంచి బలంగా టికెట్ ఆశిస్తున్నా కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు నిరాశకు గురికాకతప్పదు ….పొంగులేటిని రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కో -చైర్మన్ గా అధిష్టానం నియమించిందని… పొంగులేటి , తుమ్మల ఒక అంగీకారానికి వస్తే పోటీ రసవత్తరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

అయితే లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నందున తాము కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు పావులు కదుపుతున్నాయి.. ఏఐసీసీ నేతలతో లెఫ్ట్ పార్టీల నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు .అధిష్టానం ఒకే చెపితే పాలేరు సిపిఎం కు , కొత్తగూడెం సిపిఐ కి కేటాయించే అవకాశాలు ఉన్నాయి…అప్పుడు తుమ్మల ఖమ్మంలో పోటీచేయాల్సిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడతాయి…పొంగులేటిని ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీచేయమని అధిష్టానం కోరే అవకాశం లేకపోలేదని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారు . సీట్లు ప్రకటించేనాటికి అనూహ్యపరిణామాలు జరిగే అవకాశాలు తోసిపుచ్చలేమని పరిశీలకుల అభిప్రాయం… కొత్తగూడెం సీటు పోట్ల నాగేశ్వరరావు ,ఎడవల్లి కృష్ణ , నాగసీతారాములు మధ్య పోటీనెలకొన్నది .అయితే ఇక్కడ నుంచి పోటీకి తహతహలాడిన పొంగులేటి కారణాలు ఏవైనా వెనక్కు తగ్గాడని తెలుస్తుంది…

స్క్రినింగ్ కమిటీ పరిశీలనలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు …

పాలేరు ….తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాయల నాగేశ్వరరావు
ఖమ్మం …..తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మహమ్మద్ జావేద్
వైరా ….రాందాస్ నాయక్ , బాలాజీ నాయక్ , విజయాబాయి
మధిర ….భట్టి విక్రమార్క ….ఒక్కరి పేరు
సత్తుపల్లి ….సంభాని చంద్రశేఖర్ , డాక్టర్ మట్టా రాగమయి , సుధాకర్
కొత్తగూడెం ….పోట్ల నాగేశ్వరరావు , ఎడవల్లి కృష్ణ , నాగసీతారాములు
ఇల్లందు ….డాక్టర్ రవినాయక్ , కోరం కనకయ్య , ప్రవీణ్ , చీమల వెంకటేశ్వర్లు
పినపాక ….చందా సురేష్ , శ్రీవాణి , పాయం వెంకటేశ్వర్లు
అశ్వారావుపేట …సున్నం నాగమణి , జారే ఆదినారాయణ , తాటి వెంకటరర్లు
భద్రాచలం ….పొదెం వీరయ్య ఒక్కరి పేరు

పై జాబితాలో ఉన్న పేరు పరిశీలనలో ఉన్నాయి…అయితే ఈనెల 27 ,28 తేదీల్లో మరోసారి ఢిల్లీలో స్క్రినింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తీ అవుతుంది.అక్టోబర్ 1 లేదా 2 వ తేదీన అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటిస్తుందని సమాచారం …

Related posts

ప్రత్యర్థులను విమర్శించడానికి బూతులు మాట్లాడాలా?: సీఎం కేసీఆర్

Ram Narayana

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి: కేసీ వేణుగోపాల్ కీలక ప్రకటన

Ram Narayana

యతి ప్రాసలతో కాంగ్రెస్ ను ఉతికి పారేసిన మంత్రి హరీష్ రావు …

Ram Narayana

Leave a Comment