Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు…ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్!

ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు …ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్
వైద్య శాఖ జిఓ 142 రద్దయ్యేవరకు వైద్య ఉద్యోగుల పక్షాన పోరాటం * .
ఈ జి ఓ అమలు అయితే 4 వేలమంది ఉద్యోగులకు అన్యాయం
ఖాళీలను భర్తీ చేయాలి …జనాభాకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రాలు పెంచాలి …

ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆరోగ్యకేంద్రాలను ,సబ్ సెంటర్స్ పెంచకపోవడం విచారకరమని ఖమ్మం జిల్లా టి ఎన్ జి ఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ అన్నారు 142 జిఓ రద్దును విరమించుకునేంతవరకు,వైద్య ఉద్యోగుల న్యాయమైన సమస్య పరిష్కరమయ్యే వరకు వైద్య ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటోందని తెలిపారు. ఈ సందర్భంగా అప్జల్ హసన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ జిఓ 142 అసంబద్ధంగా, ఆశాస్ట్రీయంగా ఉందన్నారు ఖమ్మం ఐడిఓసి ఎదుట సోమవారం వైద్య ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు టీఎన్జీఓ యూనియన్ జిల్లా యూనియన్ పక్షాన అప్జల్ హసన్,కార్యదర్శి ఆర్.వి.ఎస్.సాగర్ ల యూనియన్ బాద్యులతో కలిసి సంఘీభావం తెలియజేశారు. ఈ జిఓ వల్ల వైద్య ఉద్యోగులు 4 వేల మందికి పైగా క్యాడర్ కు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను,సబ్ సెంటర్స్ ను పెంచడం లేదని చెప్పారు.జీవో 142 వల్ల ప్రతి క్యాడర్ లో ప్రమోషన్ పోస్టులు రద్దవుతున్నాయని,ఇట్టి జిఓ ను తక్షణమే రద్దు చేసే వరకు వైద్య ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓ అండగా ఉంటోందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం వైద్య ఉద్యోగుల న్యాయమైన కోరికలు పరిస్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు .వారి న్యాయమైన పోరాటానికి, దీక్షలకు ఉద్యోగసంఘాల పక్షాన తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు .

అనంతరం అప్జల్ హసన్ ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ను,డీ ఎమ్ &హెచ్ ఓ ,మాలతిలను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను,రాష్ట్ర కార్యదర్శి జి.ఎస్.ప్రసాద్ రావు,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సుంచు వీరనారాయణ,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శాబాసు జ్యోతితదితరులు పాల్గొన్నారు ..

Related posts

ఇంకా నిర్ణయంకాని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి …

Ram Narayana

విలీన గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు…. మంత్రి తుమ్మల

Ram Narayana

మంత్రులకు శంఖుస్థాపనలపై ఉన్న శ్రద్ద …వరద భాదితులను ఆదుకోవడంలో లేదు …

Ram Narayana

Leave a Comment