ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు
▪️ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల
▪️ జిల్లా పార్టీ * కార్యాలయంలో కేక్ కటింగ్ స్వీట్లు పంపిణీ*
▪️ మచ్చలేని చంద్రుడు చంద్రన్న: కూరపాటి
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కారణజన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లోగల ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా ఎన్టీఆర్ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి చరిత్రలోనే లేరన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చంద్రబాబు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధే ఆయుధంగా అనుక్షణం పనిచేస్తున్నారని కొనియాడారు. ఓటుకు కోట్లు కేసు లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడం ఆయన నిజాయితీకి నిదర్శనం అన్నారు. మచ్చలేని చంద్రుడు గా చంద్రబాబు పిలుస్తున్నారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్, ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, మల్లెంపాటి అప్పారావు, వాసిరెడ్డి భాస్కరరావు, నల్లమల రంజిత్, నున్నా నవీన్ చౌదరి, వక్కంతుల వంశీ ,ఆకారపు శ్రీనివాసరావు, నూక అనుమంతు రావు, కంపాటి విజయ్, రాజరాజేశ్వరి, ప్యారిస్ వెంకన్న, కృష్ణ ప్రసాద్ ,నాగండ్ల లక్ష్మణ్, యర్నం జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్లు
- పరిశీలించిన జిల్లా కలెక్టర్, కమిషనర్
- అందరికీ వేయాలని కోరిన టీయూడబ్ల్యూజే నేతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో విజయవంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని పీహెచ్ సీలు.. అర్బన్ హెల్త్ సెంటర్లు.. ఇతర చోట్ల ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఖమ్మం పాత బస్టాండ్ దగ్గరలోని రిక్కాబజార్ హై స్కూల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో టీయూడబ్ల్యూజే నాయకులు వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, టెంజూ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖదీర్ లు స్వయంగా వ్యాక్సిన్ వేయించుకుని మిగతా జర్నలిస్టులకు కూడా దగ్గరుండి వ్యాక్సిన్ వేయించారు. రిక్కాబజార్ వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాగ్ జయంతి లు పరిశీలించారు. ఆన్ లైన్ నమోదు.. వ్యాక్సిన్ వేసే తీరును ప్రత్యేకంగా గమనించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ జిల్లా కలెక్టర్ దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. నాన్ అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్ వేయాలని.. అక్రిడిటేషన్ నిభంధన వల్ల మిగతా జర్నలిస్టులు అవకాశాన్ని కోల్పోతున్నారని వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అక్రిడిటేషన్ కార్డులు లేని వారి జాబితాను తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ యూనియన్ నేతలకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి యాకూబ్ పాష, వైద్యాధికారి అనంతుల త్రభువన భార్గవి, జర్నలిస్టులు ప్రసేన్, వెంకట్రావు, శ్రీనివాస్, జానీ పాష, ఫెడరేషన్ నాయకులు మహ్మద్ జావిద్, టీవీజేఏ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వికాస తరంగిణి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ లో ఉచిత భోజనం ప్యాకెట్లు పంపిణీ
ఖమ్మం : పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో ఖమ్మం వికాస తరంగిణి ఆధ్వర్యంలో దిగుమతి శాఖ చాంబర్ ఆఫ్ కామర్స్ లో శుక్రవారం నాడు వ్యవసాయ మార్కెట్ నందు రైతులకు , హమాలీలకు , దడవాయి సోదరులకు ఉచిత అన్నం పొట్లాలు , వాటర్ ప్యాకెట్లు , పెరుగు ప్యాకెట్ , అరటి పండ్లును సుమారుగా 12౦౦ వందల మందికి మార్కెట్కు వచ్చే రైతులకు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సంస్థ అధ్యక్షులు పోలా శ్రీనివాసరావు , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు , వికాస తరంగిణి సభ్యులు శ్రీరామమూర్తి , నాగేంద్ర , నవీన్ , ఇoదు లేఖ , నాగమణి మార్కెట్ సభ్యులు గోపాల్ రావు , యర్రా అప్పారావు తదితరులు పాల్గొన్నారు .
ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఖమ్మం జిల్లా తీన్మార్ మల్లన్న టీం చేయూత
తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ అధ్యక్షులు దాసరి భూమయ్య ఆధ్వర్యంలో వైరా ఠాగూర్ విద్యాసంస్థల అధినేత సంక్రాంతి రవికుమార్ సహకారంతో వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ కాకాటి వినోద్ కుమార్ నేతృత్వంలో తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం లాక్ డౌన్ సందర్భంగా ఎంతోమంది పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో ఉన్న ఠాగూర్ విద్యాసంస్థల వద్ద భోజనం ఏర్పాటు చేసి ఖమ్మం వైరా పరిసర ప్రాంతాల్లో రోజుకి మూడు వందల మందికి భోజనం ప్యాకెట్లు ఇచ్చి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బాధ్యులు నాగయ్య (రిటైడ్ CI), కాకాటి వినోద్ కుమార్, గుంటుపల్లి కృష్ణ, వంగూరి ఈశ్వరి, హరీష్ ప్రకాష్ మల్లిక నవ్య కృష్ణ, ఆనంద్, సురేష్, పీరుసాహెబ్, సైదాచారి, రాజు, మాదినేని పద్మ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం బస్తాలు తరలింపు కై మిల్లులు తోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గారికి తెలంగాణ రైతు సంఘం వినతి
ఉన్నత అధికారుల తో మాట్లాడిన శాసన సభ్యులు
వైరా నియోజకవర్గ పరిధిలో వైరా, కొణిజర్ల, ఏన్కూర్ మండలాల్లో యాసంగి ధాన్యం కొనుగోలు, ధాన్యం బస్తాలు తరలింపు తీవ్ర జాప్యం జరుగుతుంది మిల్లులు తోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాల్లో నుంచి ధాన్యం బస్తాలు తరలింపు చేయాలి అని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వైరా శాసన సభ్యులు లావుడ్య రాములు నాయక్, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ కు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, వైరా మండలం లో 20 శాతం ధాన్యం కొనుగోలు కాలేదని వైరా మండలం లో 6 గ్రామాల్లో నుంచి, కొణిజర్ల మండలం లో 4 గ్రామల నుంచి ఒక్క ధాన్యం బస్తా కూడా ఎగుమతి జరగలేదని, మిగితా కొనుగోలు కేంద్రాల్లో కట్టాలు అయి మిల్లులు కేటాయింపు చేయకపోవడంతో ధాన్యం బస్తాలు 40,50 రోజుల నుంచి అక్కడే ఉంటున్నాయి అని, భువనగిరి ప్రాంతంలో మిల్లులకు వైరా నుంచి ధాన్యం ఎగుమతి చేస్తే అక్కడ దిగుమతి కాక లారీలు అందుబాటులో లేకుండా పోయింది అని వివరించారు రైస్ మిల్లులు తోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాల్లో నుంచి ధాన్యం బస్తాలు తరలింపు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ 6 రోజుల లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు వైరా మండలం లో గన్నీ సంచులు సరఫరా లేక కట్టాలు వేయకపోవడం జరుగుతుంది అని వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బయటకు రావడానికి ఇబ్బందులు ఉంటాయి అని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నుంచి ధాన్యం బస్తాలు తరలింపు చేయాలి అని విజ్ఞప్తి చేశారు, వైరా శాసన సభ్యులు లావుడ్య రాములు నాయక్ వెంటనే జిల్లా అధికారులు దృష్టి కి ఫోన్ ద్వారా ధాన్యం రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు, జిల్లా అధికారులు మిల్లులు తోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ధాన్యం కొనుగోలు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, చెరుకు మల్లి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు
లాక్ డౌన్ అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఐజీపీ ప్రమోద్ కుమార్
కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం ,
ములుగు,మహబుబాబాద్
జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలు తీరుపై జిల్లా ఎస్పీలతో సిఐడి ఐజీపీ పి. ప్రమోద్ కుమార్ (ఇంచార్జ్ డిఐజీ వరంగల్ రెంజ్ & డిఐజి కరీంనగర్ రెంజ్ ) సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో శాంతిభద్రతలు, శాఖపరమైన అంతర్గత పరిపాలన విభాగాల (అడ్మినిస్ట్రేషన్) ఆంశాలను చర్చించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ములుగు జిల్లా ఎస్పీ సంగ్రమ్ సింగ్ జీ పాటిల్ , మహాబుబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి పాల్గొన్నారు.
మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందుతుడిపై PD యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్
అభంశుభం తెలియని ఓ చిన్నారి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందుతులు కల్లెపల్లి సంపత్@ జంపన్న పై PD యాక్ట్ అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
వివరాలు :-
నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కల్లెపల్లి సంపత్ @ జంపన్న 25 సం||లు అనే వ్యక్తి
ఈ ఏడాది ఫిబ్రవరి 7న
ఖమ్మం నగరంలోని UPH కాలనీ ప్రాంతానికి చెందిన 12 సం॥ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.
ఇట్టి విషయంలో ఖానపూరం హవేలీ పోలీస్ స్టేషన్ లో 70/2021 U/3 376AB, 366, 294 (b) 506 IPC & sec 4,17 of pocso యాక్ట్ కేసు నమోదు చేయటం జరిగింది.
ఈ కేసులో కల్లెపల్లి సంపత్ జంపన్న 15-02-2021 న అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం , ఖమ్మం జిల్లా జైలుకు తరలించడం జరిగింది.
ఏప్రియల్ 27 న జైలు నుండి బెయిల్ పై విడుదలైన నిందుతుడు చూసిన స్ధానిక ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతూ….చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం తో పాటు గతంలో మరో 15 రాత్రిపూట దొంగతనాలు, కేసుల్లో కరుడుగట్టిన నేరస్తుడిగా గుర్తించి PD act నమోదు చేశారు. ఇలాంటి నేరస్ధులు సమాజంలో తిరగడం చాల ప్రమాదకరంగా భావించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ నిందుతులపై పిడీ యాక్ట్ అమలు చేసి తిరిగి జైలుకు పంపించారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం ఆర్బన్ సిఐ వెంకన్న బాబు సంబంధిత పిడీ యాక్ట్ పత్రాలను కల్లెపల్లి సంపత్@ జంపన్న అందజేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.