Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రధాని మోదీ ఇప్పటికైనా తెలంగాణ గడ్డపై పాపపరిహారం చేసుకోవాలి!: కేటీఆర్

  • ప్రధాని మోదీ ఓట్ల కోసం బయలుదేరిన మాయగాడని కేటీఆర్ విమర్శలు
  • తమపై నీకెందుకింత పగ చెప్పమంటూ నిలదీత  
  • తల్లిని చంపి బిడ్డను వేరు చేశారనే విషపు మాటలు ఎందుకని ప్రశ్న
  • పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తావా? లేక ప్రజాగ్రహానికి గురవుతావా? అని నిలదీత

ఎల్లుండి ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్నాడని, కానీ ఆయన ఓట్ల వేట కోసం బయలుదేరిన మాయగాడని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మోదీని తాను ఒకటే అడుగుతున్నానని, ప్రధానమంత్రిగారూ… పాలమూరు ప్రజలకు చెప్పు మాపై నీకెందుకింత పగ అని ప్రశ్నించారు. కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చావని, కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మాపై ఎందుకు అంత పగ? అని ప్రశ్నించారు. కష్టపడి సాధించిన తెలంగాణను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారనే విషపు మాటలు ఎందుకన్నారు. ఇలా దిగజారుడు రాజకీయం ఎందుకు చేస్తున్నావ్? అని మండిపడ్డారు.

ఇక్కడకు ఎల్లుండి వస్తున్నావ్ కదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తావా? లేక ప్రజాగ్రహానికి గురవుతావా? అన్నది మోదీ చెప్పాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కోసం ఒక్క సంతకం పెట్టేందుకు మీకు చెయ్యి రావడం లేదన్నారు. ఈ వలస జిల్లా పాలమూరును నాశనం చేసింది నాటి బీజేపీ, కాంగ్రెస్ పాలకులని, ఇప్పటికైనా మోదీ పాపపరిహారం చేసుకోవాలన్నారు. 575 టీఎంసీల నీళ్లు పాలమూరుకు ఇస్తున్నానని చెప్పి బూత్ పూర్ గడ్డపై మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మనం ఎన్ని దరఖాస్తులు పంపినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని, వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ అడిగితే పట్టించుకోలేదన్నారు. మనం ఓటుతోనే తెలంగాణ సాధించుకున్నామని, రేపు అదే ఓటుతో మరోసారి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. రేపు ఢిల్లీలో మనం లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడలేని పరిస్థితిని కల్పిద్దామన్నారు. తెలంగాణ సత్తా చాటుదామని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు అడ్డువచ్చే కేంద్రంలోని రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ల మెడలు వంచి మన జగన్నాథ రథ చక్రాల కింద తొక్కుకుంటూ ముందుకు వెళ్దామన్నారు.

Related posts

ఓటీపీ.. బ్యాంక్ వివరాలు షేర్ చేయకండి.. మల్లు భట్టి మాటలు విని డబ్బులు పోగొట్టుకోకండి : కేటీఆర్ హెచ్చరిక

Ram Narayana

తెలంగాణ పీసీసీ ఫీఠంపై పీటముడి ..

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి…కిషన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment