ఆంధ్రప్రదేశ్

రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం

  • రోజాకు బండారు తక్షణమే క్షమాపపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్
  • మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు దిగజారుడుతనమని విమర్శ
  • రోజాకు మద్దతు ప్రకటిస్తున్నానని వ్యాఖ్య

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమని అన్నారు. 

Related posts

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష!

Drukpadam

దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఏపీలో సిద్ధం.. ఇక ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి!

Ram Narayana

దోమలు విపరీతంగా ఉన్నాయి.. స్నానానికి చన్నీళ్లు ఇస్తున్నారు: నారా భువనేశ్వరి

Ram Narayana