Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది జలసమాధి…

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది జలసమాధి
  • ప్రమాద సమయంలో 160 మందికిపైగా ప్రయాణికులు
  • గల్లంతైన 83 మందీ చనిపోయి ఉంటారని అనుమానం
  • నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం

నైజీరియాలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 60 మంది జల సమాధి అయ్యారు. మరో 83 మంది గల్లంతయ్యారు. కెబ్బీ రాష్ట్రంలోని వర పట్టణానికి సమీపంలోని నైజర్ నదిలో జరిగిందీ దుర్ఘటన. ప్రమాద సమయంలో పడవలో 160 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యంలో ఓ వస్తువును ఢీకొనడం వల్ల పడవ ముక్కలైందని, దీంతో అందులోని వారు మునిగిపోయారని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. 60 మృతదేహాలను వెలికితీశారు. కొందరిని రక్షించగలిగారు. గల్లంతైన మరో 83 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పడవ శిథిలావస్థకు చేరుకోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Related posts

ఈ పరిస్థితుల్లో అవార్డు వద్దు … ప్రకటించినందుకు ధన్యవాదాలు :తెలకపల్లి రవి!

Drukpadam

అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌‌, ఎమ్మెల్యే రసమయి మధ్య వాగ్వివాదం!

Drukpadam

ఆర్థ్రరాత్రి తమ ఇంటి వద్ద వేచి ఉన్న మీడియా ప్రతినిధుల అన్నపానీయాలపై ఆదిత్య థాకరే ఆరా !

Drukpadam

Leave a Comment