Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుజాతీయ వార్తలు

పెళ్లిళ్ల కారణంగా ఎన్నికల తేదీనే మార్చిన ఈసీ …రాజస్థాన్ లో ఎన్నికల తేదీల మార్పు …!

పెళ్లిళ్ల కారణంగా ఎన్నికల తేదీనే మార్చిన ఈసీ …రాజస్థాన్ లో ఎన్నికల తేదీల మార్పు …!
నవంబర్ 23న పెళ్లిళ్లు, శుభకార్యాలు
రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
23న దేవ్ ఉతానీ ఏకాదశి కారణంగా ఓటింగ్ శాతం తగ్గుతుందన్న పార్టీలు
పోలింగ్ తేదీని 25కు మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం..
ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించిన రాజకీయపార్టీలు

రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని మార్చింది. షెడ్యూల్ ప్రకారం రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 23న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఆ రోజున దేవ్ ఉతానీ ఏకాదశి కారణంగా బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఈసీకి లేఖ రాశాయి. ఆ రోజున పెద్ద ఎత్తున పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయని, ఆ రోజున పోలింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం భారీగా తగ్గుతుందని, కాబట్టి మరో తేదీని పోలింగ్ కోసం ప్రకటించాలని కోరాయి. ఈ మేరకు ఈసీకి లేఖ రాశాయి. పార్టీల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ పోలింగ్ తేదీని నవంబర్ 23కు బదులు నవంబర్ 25కు మార్చింది. ఈసీ నిర్ణయాన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయి…

నవంబర్ 23న రాజస్థాన్‌లో 50,000కు పైగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. ఈ సమయంలో శుభకార్యాలకు అటెండ్ అయ్యేవారు, వ్యాపారం కోసం చూసేవారు ఓటు వేసేందుకు మొగ్గు చూపకపోవచ్చు. అందుకే ఈసీ కూడా పార్టీల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని, పోలింగ్ తేదీని మార్చింది.

Related posts

ఛత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ భూటకం …సి.పి. ఐ (యం. ఎల్) రెడ్ స్టార్

Ram Narayana

సొంత నియోజకవర్గం నుంచి మరో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Ram Narayana

సీఎం రమేశ్ మైనింగ్ కంపెనీకి చెందిన తెలంగాణ అధికారి మృతి…

Drukpadam

Leave a Comment