Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఈ ప్రపంచం మొత్తం తమ చట్టం కిందే ఉంటుందన్న హమాస్ కమాండర్.. ఘాటుగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని

  • ప్రపంచంపై గుత్తాధిపత్యమే తమ లక్ష్యం అన్న హమాస్ కమాండర్ అల్ జహార్
  • తొలి టార్గెట్ ఇజ్రాయెల్ అని వ్యాఖ్య
  • హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలిస్తామన్న నెతన్యాహూ

ఓవైపు ఇజ్రాయెల్ – పాలస్తీనా (గాజా స్ట్రిప్) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కమాండర్ మహ్మౌద్ అల్ జహార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంపై గుత్తాధిపత్యాన్ని సాధించడమే హమాస్ లక్ష్యం అని ఆయన చెప్పారు. హమాస్ లక్ష్యాల గురించి ఆయన వెల్లడిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తమ తొలి టార్గెట్ ఇజ్రాయెల్ అని… ఆ తర్వాత యావత్ ప్రపంచం మీద దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ భూభాగం మొత్తం తమ చట్టం కిందే ఉంటుందని అన్నారు. 

510 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూమి మొత్తం మన వ్యవస్థ కిందకు వస్తుందని… ఆ వ్యవస్థలో పాలస్తీనీయులతో పాటు లెబనాన్, సిరియా, ఇరాక్ ఇతర దేశాల్లోని అరబ్బులపై జరగుతున్న అన్యాయం, అణచివేత, హత్యలు వంటివి ఉండవని అల్ జహార్ చెప్పారు.  

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఘాటుగా స్పందించారు. హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలిస్తామని ఆయన అన్నారు. పాలస్తీనియన్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ చచ్చినవారేనని వ్యాఖ్యానించారు. 

హమాస్‌ను ఈ భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.. నెతన్యాహు వార్నింగ్

Israel PM Benjamin Netanyahu Warns To Wipe Hamas

ఊహించని దాడులతో ఇజ్రాయెల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్‌లో ఒక్కరిని కూడా విడిచిపెట్టబోమని, ఈ భూమ్మీద నుంచి హమాస్‌ను పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. హమాస్‌ను పూర్తిగా అంతమొందిస్తామని నెతన్యాహు స్పష్టంగా చెప్పడం ఇదే తొలిసారి. 

‘‘ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అయిన హమాస్‌ను పూర్తిగా అణచివేస్తాం. ఈ ప్రపంచం నుంచి వారిని పూర్తిగా నిర్మూలిస్తాం’’ అని తాజాగా ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్‌తో కలిసి ప్రకటించారు. రక్షణ మంత్రి యావ్ గాలంట్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. భూమిపై హమాస్ అనేదే లేకుండా తుడిచిపెట్టేస్తామని పేర్కొన్నారు.  

కాగా, ప్రస్తుత ఆపత్కాల సమయంలో మాజీ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్‌తో ఉన్న రాజకీయ విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన నెతన్యాహు అత్యవసర ప్రభుత్వాన్ని (వార్ క్యాబినెట్) ఏర్పాటు చేశారు.

ఇజ్రాయెల్ లో చిక్కుకున్న మన వాళ్లను రప్పించేందుకు ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభం

India Launches Operation Ajay To Bring Indians From Israel

ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో పెద్ద సంఖ్యలో విదేశీయులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, ఇతరులు ఉన్నారు. టూరిజం కోసం వెళ్లిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా మన దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలను చేపట్టింది. మన పౌరుల కోసం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. మన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. ఈ రోజు నుంచే ఆపరేషన్ అజయ్ ప్రారంభం అవుతుందని ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం అధికార ప్రకటన చేసింది. గతంలో ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను రప్పించేందుకు కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టిన సంగతి తెలిసిందే.

హమాస్ దాడిలో 22 మంది అమెరికన్ల మృతి.. నేడు ఇజ్రాయెల్‌కు యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్

Israel orders military closures in Gaza

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇరువైపులా ఇప్పటి వరకు సామాన్య పౌరులు సహా 3 వేల మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ అధీనంలోని గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ యూనిటీ గవర్నమెంట్, వార్ క్యాబినెట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మరోవైపు, హమాస్ తీవ్రవాదుల దాడిలో 22 మంది అమెరికన్లు మరణించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సీనియర్ అధికారులతో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నేడు సమావేశమయ్యే అవకాశం ఉంది. 

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో కొన్ని కీలక అప్‌డేట్స్

* గాజాపై ఇప్పటి వరకు వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. భూ దాడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గాజాను పూర్తిగా మిలటరీతో దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. 

* గాజా సరిహద్దుకు పెద్ద ఎత్తున దళాలను, మిలటరీ సంపత్తిని తరలించింది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 3 లక్షల మందిని మోహరించింది.

* ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు, ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్‌తో కలిసి ఇజ్రాయెల్ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధం.. పెరుగుతున్న ఉద్రిక్తతలను ఇది పర్యవేక్షిస్తుంది. 

* అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నేడు ఇజ్రాయెల్ చేరుకుంటారు. ఆ దేశ సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. హమాస్ దాడుల బాధితులకు సంతాపం తెలుపుతారు. దాడులను తీవ్రంగా ఖండిస్తారు. ఇజ్రాయెల్ భద్రతను పెంపొందించే చర్యలపైనా చర్చిస్తారు. ఆ దేశానికి భేషరతు మద్దతు ప్రకటిస్తారు. 

* హమాస్ దురాగతాలపై ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. పాలస్తీనా తీవ్రవాద గ్రూపులు తమ దేశంలో సైనికులను పొట్టనపెట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అమ్మాయిలు, అబ్బాయిల తలలపై కాల్చి చంపారని.. పురుషులు, మహిళలను సజీవ దహనం చేశారని, యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డారని, సైనికుల తలలు నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. 

*  హమాస్ ఉగ్రవాదులు చిన్నారుల తలలు నరికిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. ఈ విషయాన్ని వైట్‌హౌస్ కానీ, ఇతర సీనియర్ అధికారులు కానీ ధ్రువీకరించలేదు.  

* హమాస్ దాడిలో 22 మంది అమెరికా పౌరులు మరణించినట్టు అమెరికా ధ్రువీకరించింది. అయితే, వారంతా ఎక్కడ? ఎలా మరణించారన్న దానిపై తాను స్పష్టత ఇవ్వలేనని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.  

* గాజాపై జరుగుతున్న వైమానిక దాడుల్లో 51 మంది పాలస్తీనియన్లు మరణించారని, 281 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రి తెలిపారు. వీరితో కలుపుకొని గాజాలో ఇప్పటి వరకు 1,200 మంది మరణించినట్టు పేర్కొన్నారు.

Related posts

దీపావళి విందులో మందు, మాంసం.. యూకే ప్రధానిపై విమర్శలు…

Ram Narayana

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. 7 లక్షల మంది హాజరు!

Ram Narayana

హిందువులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెనడా ప్రధాని

Ram Narayana

Leave a Comment