Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అధికారులపై ఎమ్మెల్సీ తాతా బెదిరింపులు…ఆ వీడియో ఇప్పటిది కాదని ఖండినచిన మధు ..!

అధికారులపై ఎమ్మెల్సీ తాతా బెదింపులు…ఆ వీడియో ఇప్పటిది కాదని ఖండినచిన మధు ..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో వీడియో ప్రదర్శించడం పై మధు ఫైర్
తనను కొందరు కావాలాలని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం
రేవంత్ రెడ్డిలా తాను మాట్లాడనని

ఉమ్మడి ఖమ్మంజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు ఒక సమావేశంలో అధికారులను బెదిరిస్తూ మాట్లాడని వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది…కలెక్టర్ , ఎస్పీ , జిల్లా అధికారులు , మండల అధికారులు ఎవరైనా మన మాట వినాల్సిందే వినపోతే వారి సంగతి చూస్తామంటూ మాట్లాడిన మాటలు ఆ వీడియో లో ఉంది..దీనిపై తాతా మధు స్పందించారు .
తాను అధికారులను దూషించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. భద్రాచలం ఎన్నికల ప్రచారంలో ఉన్నా మధు మీడియాతో మాట్లాడుతూ పాత వీడియోను , సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాజా వీడియోగా చిత్రీకరించేందుకు కుట్ర చేయడం దుర్మార్గమన్నారు … ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఎదుర్కునే సత్తాలేని కొన్ని పార్టీలు , ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు . ఆ వీడియో 2019 నాటిదని , అప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొందరి అధికారుల తీరుకు నిరసనగా నేను ఆ మాటలు మాట్లాడిన మాట నిజమేనని అంగీకరించారు . అప్పడు తాను ఎమ్మెల్సీ గా కూడా లేనని అన్నారు . కావాలని తనను కొందరు టార్గెట్ చేసి ఈ రకమైన ప్రచారానికి ఒడిగట్టారని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు ..

పాత వీడియోను , కొత్త వీడియోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు … బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెట్టి అధికారుల తాటతీస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి లాగా తాము బరితెగించలేమని అన్నారు . పదేపదే తెలంగాణ అధికారుల మనోభావాలను దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి సంగతి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ..
అప్పటి పరిస్థితుల్లో కార్యకర్తల రక్షణ కోసం మాత్రమే తాను అలా మాట్లాడాను తప్ప అధికారులను కించపరిచే ఉద్దేశం లేదని మధు వివరణ ఇచ్చారు …

Related posts

ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా… ఆమోదించిన గవర్నర్ తమిళిసై

Ram Narayana

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి… కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

Ram Narayana

కేటీఆర్ దురహంకారి: మంత్రి సీతక్క ఆగ్రహం

Ram Narayana

Leave a Comment