Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!
గెలుపుకోసం … వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ నేతలు
సామాజికసమీకరణాలే కీలకం అంటున్న పరిశీలకులు
ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటున్న తుమ్మల అనుయాయులు
లెఫ్ట్ పార్టీలను కలుపుకొని పోయాలని నిర్ణయం…

పాలేరు సీటు ఇవ్వకపోతే తుమ్మల పోటీలో ఉండడని ….పాలేరులో పోటీ కోసమే అందులో చేరాడని తుమ్మల అనుయాయిలు బల్లగుద్ది వాదిస్తున్న వేళ ఆయనకు పాలేరు సీటు అధిష్టానం కన్ఫామ్ చేసినట్లుగా సమాచారం …పాలేరు సీటు కోసం ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరావు ,ఫ్రై లో ఉండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు . దీంతో పొంగులేటి ,తుమ్మల ఇరువురిలో పాలేరు ,ఖమ్మం ఎవరు పోటీచేస్తారో తేల్చుకొని రావాలని అధిష్టానం వారికి సూచింది …దీంతో పలుమార్లు సమావేశమైన ఇద్దరు నేతలు ఒక అంగీకారానికి వచ్చారు . ఖమ్మం ,పాలేరు పై ఒక అవహగానాకు వచ్చారు .అంతే కాకుండా ఇద్దరు కల్సి ప్రచారం లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు …

దీంతో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీచేయడం దాదాపు ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం …పాలేరు నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్న తుమ్మలకు ప్రస్తుత రాజకీయపరిస్తితుల్లో ,ఖమ్మం కీలక స్తానం కావడంతో కాంగ్రెస్ పెద్దలు ఆయనతో చర్చించి ఖమ్మం లో పోటీచేసేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది .. . పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీచేయనున్నారు… పాలేరు సీటు ఆశించిన రాయల నాగేశ్వరరావు పార్టీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు ..ఎప్పటినుంచో నియోజకవర్గ ఇంఛార్జిగా ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తనకు అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు … ఇక కొత్తగూడం సీటు విషయం ఇంకా ఫైనల్ కాలేదని అక్కడ నుంచి సిపిఐ కి ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని సమాచారం . అదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి జిల్లాలో బీసీ అభ్యర్థికి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సిపిఎం పాలేరు సీటు కావాలని పట్టు బట్టింది..సిపిఎం కేంద్ర నాయకత్వం ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే , కేసి వేణుగోపాలతో చర్చించారు . రాష్ట్రంలో సిపిఐ , సిపిఎం లు చెరొక 5 సీట్లు కావాలని అడిగినట్లు సమాచారం …అయితే వారికీ చెరొక రెండు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని అంటున్న అవి ఎక్కడ ఇస్తారనేది చర్చనీయాంశమగా మారింది..

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1

Ram Narayana

ఖమ్మంలో ధనస్వామ్యని ఓడించండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి…

Ram Narayana

సత్తుపల్లిలో సండ్రకు ప్రజల బ్రహ్మరథం …రోజురోజుకు పెరుగుతున్న మద్దతు…

Ram Narayana

Leave a Comment