Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పార్టీ మార్పు గురించి పువ్వాడ అజయ్ మాట్లాడటం హాస్యాస్పదం …కమర్తపు మురళి

పార్టీ మార్పు గురించి పువ్వాడ అజయ్ మాట్లాడటం హాస్యాస్పదంకమర్తపు మురళి
అజయ్ కొద్దికాలంలోనే ఎన్ని పార్టీలు మారింది ప్రజలు తెలియదా
తుమ్మల ,పొంగులేటి బందిపోట్లా…? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి
నీ పద్ధతులు నచ్చక పార్టీ మారితే తడాఖా చూపిస్తానంటున్నావుబెదిరింపులా..
వైయస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టిన విషయం గుర్తు లేదా
ఖమ్మం అభివృద్ధి ప్రధాత తుమ్మల కాదా
తుమ్మల మంత్రి అనే మంత్రదండాన్ని ప్రజలకు ఉపయోగిస్తేనీవు సొంతానికి ఉపయోగించుకుంది నిజం కాదా …?
తుమ్మలను ఓడించానని అంటున్నావు నీవు కాదు ఓడించింది చేతిగుర్తు
అదే చేతి గుర్తు నిన్ను ఓడించడం ఖాయండిసెంబర్ 3 తర్వాత నీవ్వు మాజీ కావడం ఖాయం

తుమ్మల పార్టీ మార్పు గురించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడటం హాస్యాస్పదంగా ,దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బీఆర్ యస్ నగర మాజీ అధ్యక్షుడు కమర్తపు మురళి ధ్వజమెత్తారు ..మంగళవారం సాయంత్రం ఖమ్మంలోని తుమ్మల నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చావా నారాయణ రావు ,పోట్ల వీరేందర్ తోకల్సి మాట్లాడుతూ మంత్రి అజయ్ తుమ్మల పై చేసిన విమర్శలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు .. కొద్దికాలంలోనే మూడు పార్టీలు మారి నాలుగోవ పార్టీలోకి వచ్చిన పువ్వాడ అజయ్ పార్టీల మార్పుపై నీతులు వల్లించడం తగదని హితవు పలికారు …తుమ్మల 18 సంవత్సరాల మంత్రిగా , 30 సంవత్సరాలకు పైగా ఒకే పార్టీలో ఉండి అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకు వన్నెతెచ్చింది నిజంకాదా…? అని ప్రశ్నించారు . జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకున్న తుమ్మల పై విమర్శలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు . ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి వెళ్లిన తుమ్మల అభివృద్ధి కనపడుతుందన్నారు . చివరకు నేనే చేశా , నేనే చేశా అంటున్న ఖమ్మం అభివృద్ధిలో తుమ్మల పాత్ర విస్మరించడం దారుణంగా ఉందన్నారు . తుమ్మల అనుభవం, టాలెంట్ తెలిసిన సీఎం కేసీఆర్ పిలిచి మంత్రిపదవి ఇస్తే ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్ బండ్ ఏర్పాటు , కొత్త బస్సు స్టాండ్ , ఐటీ హబ్ , ఖమ్మానికి కొత్త కలెక్టరేట్ , ధంసలాపురం దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జి , తెచ్చిన ఘనత తుమ్మలది కాదా అని అన్నారు .తుమ్మల చేసిన అభివృద్ధిని తక్కువ చేయడం నీ నీతి మాలిన చర్యకు తార్కాణం కాదా …? అని ప్రశ్నించారు. తక్కువ సమయంలోనే భక్త రామదాసు ప్రాజక్ట్ పూర్తీ చేసి కరువు మండలాలైన తిర్మలాయపాలెం , ఖమ్మం రూరల్ ,కూసుమంచి మండలాలకు సాగు తాగు నీరు అందించిన ఘనత తుమ్మలది కాదా..అన్నారు ..

తుమ్మల ఇప్పుడున్న కార్పొరేటర్లలో 50 మందికి టికెట్స్ ఇచ్చి గెలిపించింది నిజం కాదా …అని అన్నారు .తుమ్మల హయాంలోనే తనకు నగర అధ్యక్ష పదవితోపాటు కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తే పువ్వాడ తమ ఫ్యూచర్ జీవితం నాశనం చేసి పైశాచిక ఆనందం పొందడం నిజం కాదా అని పువ్వాడ విధానాలపై విరుచుక పడ్డారు . జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తానని చెప్పారు , సుడా చైర్మన్ చేస్తానన్నారు . అందుకు విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఉందని అన్నారు.

తుమ్మల , పొంగులేటి బందిపోట్లా …?

తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బందిపోట్లు అని నోటికి ఎంతమాట వస్తే అంటున్నావు … నాదే గెలుపు మరోసారి తుమ్మల తన చేతిలో ఓడిపోవడం ఖాయమని అంటున్న పువ్వాడ మాటలు విని ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు . ఎవరు దొంగలో ఎవరో బందిపోట్లు అనేది ప్రజలు గమనిస్తున్నారని నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో గుబగుయ్యుమనిపిస్తారని అన్నారు . మంత్ర దండం ఉందని వ్యక్తిగతంగా ఉపయోగిస్తే ప్రజలు క్షమించరాని మంత్రి గుర్తుంచుకోవాలన్నారు .తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము కూడా అదేవిధంగా చేయగలమని అన్నారు .

కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల గురించి బడ్జెట్ ఎక్కడిదని అంటున్న అజయ్ కి బీఆర్ యస్ ప్రకటించిన పథకాలకు బడ్జెట్ ఎక్కడిదో చెప్పాలన్నారు . సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేకం చూసిందని అజయ్ ని మొదటిసారి ఎమ్మెల్యే చేసిన ఘనత కూడా కాంగ్రెస్ దేనని అన్నారు .

Related posts

పాలేరులో లంచం మాట వినకూడదు …అధికారులు పద్ధతులు మార్చుకోవాలి: మంత్రి పొంగులేటి

Ram Narayana

ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు…పొంగులేటి

Ram Narayana

బీఆర్ యస్ లో పరుగులు పెడుతున్న నాయకులు…ప్రజల్లో కానరాని జోష్…

Ram Narayana

Leave a Comment