బందిపోట్ల ముఠాను తయారు చేసింది నువ్వు …మంత్రి పువ్వాడపై తుమ్మల అటాక్…
మమ్ములను బందిపోట్లు అనేందుకు సిగ్గు ఉండాలి
అవినీతి అక్రమాలు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఎవరు …
ఖమ్మంలో ప్రజలు స్వేచ్ఛగా బతకలేక పోతున్నారు
ఖమ్మమ్మాన్ని కబ్జాలకు అడ్డాగా చేశావు ..
బందిపోట్లకు వ్యతిరేకంగానే మా పోరాటం అందుకే ఖమ్మంలో పోటీ …!
ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ మాజీమంత్రి తుమ్మల , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం పర్యటన చేశారు . ఆసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , కార్పొరేటర్లు కమర్తపు మురళి ,మాజీ కార్పొరేటర్ చావనారాయణ రావు , సైదాబాబు , తదితరులు బీఆర్ యస్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు . ఆరోజు అజయ్ హైద్రాబాద్ లో ఉన్నారు . తాను లేని సమయంలో బొందిపోట్లలాగా కాకుండా దమ్ముంటే తాను ఉన్నపుడు వస్తే సినిమా చూపించేవాడినని ఘాటు విమర్శలు చేశారు … దానిపై తుమ్మల అనుయాయులు , కాంగ్రెస్ నేతలు స్పందించిన తుమ్మల నాటినుంచి నోరు ఇప్పలేదు …శుక్రవారం ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ మంత్రి పువ్వాడ అజయ్ పై డైరెక్ట్ ఎటాక్ చేశారు …బందిపోట్లను తయారు చేసిన మంత్రి బందిపోట్ల గురించి మాట్లాడటం అపహాస్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు …డబ్బు, దర్పం ఉందని విర్రవీగితే ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని తెలుసుకోవాలన్నారు …మమ్ములను బందిపోట్లు అనేందుకు సిగ్గుండాలని హితవు పలికారు …ఖమ్మం ప్రజలకు ఎవరు బందిపోట్లు ఎవరు అభివృద్ధి కాముకులో అన్ని తెలుసునని అధికార , డబ్బు అహంకారంతో వ్యహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు .కబ్జా కోర్టులు ఎవరో అందరికి తెలుసునని కబ్జాలకు భయపడి ప్రజలు ప్రధానంగా ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు భయంతో బతుకుతున్నారని అన్నారు .
ఖమ్మం ప్రజలు ప్రేమను పంచేవాళ్ళు, శాంతియుత వాతావరణం కోరుకునే వాళ్ళు అలంటి వారికీ కంటిమీద కునుకు లేకుండా చేసిన మహాను బాహుడు ఎవరు …?గౌరవ ప్రదంగా జీవించే వారి జీవితాలను అగమ్యగోచరంగా చేసింది ఎవరు ?… పువ్వాడ చర్యలపై చురకలు అంటించారు తుమ్మల … ఖమ్మం అంటే భయమేసి పరిస్థితు దాపురించింది …పైసా పైసా కూడబెట్టి కొనుకున్న ప్లాట్ ఉంటోందో లేదో తెలియని పరిస్థితి దాపురించింది …ఇదేనా ప్రజలు కోరుకున్నది …ఇక్క బందిపోట్ల నుండి ప్రజలు విముక్తి కల్పించేందుకే ఇక్కడ నుంచి పోటీచేస్తున్న ఖమ్మం ప్రజలు భయంలేని జీవితం గడపాలి …అంతే కానీ ఎక్కడ ఎవరు ఏది మాట్లాడిన తప్పులను సరిచేసుకోకుండా వారిపై కేసులు పెట్టి వేధించడం పై ప్రజలు ఆగ్రహం తో ఉన్నారు . నిజంగా ప్రజల్లో ఇంత ఆగ్రహం ఉందనేది నేను కూడా ఊహించలేదు …సీతారామ ప్రాజక్ట్ నీళ్లతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడగటంతోపాటు , ఖమ్మం ప్రజలకు బందిపోటు , కబ్జా రాళుళ్లనుంచి రక్షణ కల్పించేందుకే ఖమ్మం నుంచి పోటీచేస్తున్నారని అన్నారు . తన రాజకీయ జీవితంలో తన అధికారణాన్ని ప్రజల మేలుకోసం ఉపయోగించానే తప్ప దుర్వినియోగం చేయలేదని అందుకు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానులే నిదర్శం అని అన్నారు తుమ్మల …