- జగిత్యాల జిల్లాలో ప్రచారం సందర్భంగా కనిపించిన దృశ్యం
- నేటితో తెలంగాణలో మూడో రోజుకు చేరిన పర్యటన
- నేడు ఆర్మూరులోనూ విజయభేరి యాత్ర
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో విద్యలు ప్రదర్శిస్తుంటారు. పొలాల్లో రైతులతో కలసి దుక్కి దున్నడం, చెప్పులు కుట్టడం.. ఇలాంటివి ఎన్నో గతంలో చూశాం. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సైతం ఇలాంటి చర్యలనే అనుసరిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాహుల్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిగిత్యాల జిల్లాలో విజయభేరి యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా కొండగట్టులో రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి ప్రవేశించారు.
పెనంపై పిండి వేసి, మసాలా దోశ తయారు చేశారు. తాను సైతం దోశ వేయగలనని నిరూపించుకున్నారు. రాహుల్ చర్య స్థానికులను ఆకర్షించింది. హోటల్ నిర్వాహకుడికి ఎంత ఆదాయం వస్తోంది, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా తాను టింగున్న దోశను పక్కనే ఉన్న సీఎల్పీనేత భట్టి విక్రమార్క కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షేర్ చేశారు …ఇది చూసి అక్కడ ఉన్న నేతలంతా అహక్కు అయ్యారు . రాహుల్ గాంధీ అంతటివారు తన పక్కన ఉన్నవాళ్లకు తన తింటున్న దోశను స్వయంగా తన ప్లేట్ లోది తీసుకోమని చెప్పి వారికీ ఇవ్వడం అందరికి ఆకట్టుకుంది … తెలంగాణలో రాహుల్ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి కరీంనగర్ లో బస చేసిన ఆయన, శుక్రవారం ఉదయం జగిత్యాలకు ప్రయాణమయ్యారు.విజయభేరి బస్సు యాత్రలో భాగంగా నేడు ఆర్మూరులోనూ రాహుల్ పర్యటించారు . ఆ తర్వాత ఢిల్లీకి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో నిజామాబాద్ వెళ్లాల్సిన పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు …