తన గెలుపును ఎవరు ఆపలేరు … పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి!
వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా …నాకు తోచిన సహాయం అందించా …
కేసీఆర్ ఆధ్వరంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది
ఉచిత కరంట్ ,రైతుబంధు , దళిత బంధు కొనసాగిస్తాం
నియోజకవర్గంలో సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేశా
ఏ గ్రామం వెళ్లి అడిగిన కందాలే మళ్ళీ కావాలంటారు
అందరిలాగా వాగ్దానం చేయను ..చేసే చూపిస్తా …
పాలేరు లో తనకు ప్రత్యర్థి ఎవరైనా తన గెలుపును అడ్డుకునే శక్తి ఎవరికి లేదని పాలేరు ఎమ్మెల్యే బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు . ఈనెల 27 న కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు గ్రామ సమీపంలో పెద్ద ఎన్నికల సభ నిర్వహించనున్నారు .సభ ఏర్పాట్లను బీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుతో కల్సి పరిశీలించారు . ఈసందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు నేనేంటే ఏమిటో చూశారు ..నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు .ఎవరు వచ్చి అడిగిన నాకు తోచిన సహాయం చేశా…ఇది ఎవరిని అడిగిన చెపుతారు ..నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రోడ్లు తెచ్చా ..అంతేకాదు ప్రభుత్వం కేటాయించిన గవర్నమెంట్ ఇంజినీరింగ్ నియోజకవర్గానికి సీఎం కేటాయించారు .నర్సింగ్ కళాశాల వచ్చింది..మునేరు ప్రాంత ప్రజలు కరుణగిరి ,జలగం నగర్ ప్రాంతంలో ముంపుకు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణాణం చేయబోతున్నాం ,..పాలేరు పాత కాలువ ,భక్తరామదాసు ప్రాజెక్టుల ద్వారా సాగుతాగునీరు అందించాం …24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నాం…రైతు బంధు , దళిత బంధు , కల్యాణ లక్ష్మి ,షాదిముబారక్ ఆసరా పెన్షన్లు ,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తున్నాం ..విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ,ఆరోగ్యశ్రీ ద్వారా 15 లక్షల వరకు ప్రజలు వైద్యం అందించే కార్యక్రమం పెట్టాం సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే పథకం తేబోతున్నాం ఆసరా పెన్షన్లు ఐదు సంవత్సరాల్లో ఆరు వేలకు పెంచబోతున్నాం… పాలేరు నియోజకవర్గంలో గెలుపు ఖాయమని ,కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఉపేందర్ రెడ్డి అన్నారు .
నేను ఎక్కడ నుంచే ఇక్కడకు రాలేదు …
తాను ఎక్కడ వాణ్ణి …అనేకమంది ఎక్కడ నుంచో రావడం నియోజకవర్గంలో గెలవడం తరవాత పట్టించుకోకపోవడం చూస్తన్నామని దిగుమతి అభ్యర్థులపై ధ్వజమెత్తారు …ఒకాయన పాలేరు పోటికోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు ..సీతారామ ప్రాజక్ట్ నీళ్లతో పాలేరు ప్రజల కాళ్ళు కడుగుతానని అన్నారు . కానీ ఏమైందో తెలియదు ప్లేట్ ఫిరాయించి ఖమ్మంకు వెళ్లారని తుమ్మలకు చురలు అంటించారు ..
కేసీఆర్ సభకు 70 వేల మంది హాజరు …
ఈనెల 27 పాలేరు నియోజకవర్గ ప్రజా అశ్విర్వదసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారని ఉపేందర్ రెడ్డి తెలిపారు …సభకు నియోజకవర్గపరిధిలోని ఖమ్మం రూరల్ , నేలకొండపల్లి, తిరుమలాయపాలెం , కూసుమంచి మండలాల నుంచి సుమారు 70 వేల మంది హాజరవుతారని అంచనా ఉందని కందాల అన్నారు…
తుమ్మల పై తాతా మధు విమర్శలు
తుమ్మల అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు విమర్శలు గుప్పించారు .. …ఆయనకూడా చాలాకాలం మంత్రిగా చేశారు . అధికారాలు వారి విధులు వారు నిర్వహిస్తారు …పోలీసులు కేసులు పెట్టి వేధించారని చెప్పడం అభ్యంతరకరమన్నారు .అంతే కాకుండా కేసులు పెట్టిన పోలీసులను బాధితుడి ఇంటిదగ్గరకు పిలిపించి క్షమాపణ చెప్పిస్తాని చెప్పి పోలీస్ శాఖ మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడం తగదని హితవు పలికారు .. ఇలాంటి మాటలను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ది చెపుతారని హెచ్చరించారు .