Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో తుమ్మల …పువ్వాడల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం

ఖమ్మంలో తుమ్మల …పువ్వాడల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం
నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్నట్లుగా ఉన్న మాటలు
మంత్రి అజయ్ ని ఖాసీం రజ్వీ తో పోల్చిన తుమ్మ్మల ….తుమ్మలను అహంకారి బూతుల మనిషి అన్న అజయ్
అజయ్ పాలనలో అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేదించారన్న తుమ్మల
చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న పువ్వాడ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసులు పెట్టిన పోలీసులు అధికారులు ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పేవిధంగా చేస్తన్న తుమ్మల
మాట వినని అధికారులను జీప్ ముందు పరుగెత్తిస్తానని హెచ్చరిక

తుమ్మల మాటలపై రగిలిపోయిన మంత్రి అజయ్

ఖమ్మం నియోజకవర్గంలో దీపావళి రాకముందే టపాసులు పేలుతున్నాయి…ఇక్కడ కాంగ్రెస్ , బీఆర్ యస్ మధ్య పోటీచేస్తున్న ఇద్దరు ఉద్దండుల మధ్య పోరు విఠలాచార్య సినిమాను తలపిస్తుంది…మాటల బాణాలు సందించుకుంటున్నారు …ఇందులో ఎవరు తీసిపోని విధంగా మాటల యుద్ధం కొనసాగడంతో ఎన్నిక రంజుగా మారింది… ఇది ఎక్కడిదాకా పోయిందంటే నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్నట్లుగా ఉంది …

మంత్రి అజయ్ ని ఖాసీం రజ్వీ తో తుమ్మల పోల్చగా … ఆయన అహంకారి ,బూతుల మనిషి ,రౌడీయిజం , గుండాయిజం , హత్యలు చేయించిన చరిత్ర ఉందని అజయ్ తుమ్మల పై ఘాటైన విమర్శలు చేశారు .. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు …పెద్దాయన ఫ్రస్టేషన్ లో ఉన్నారని ఆయన అన్న మాటలు ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నానని అన్న మంత్రి పువ్వాడ తుమ్మల పోలీస్ అధికారులపై చేసిన విమర్శలకు రియాక్ట్ అయ్యారు…ఆమాటలు ఆయన అహంకారానికి నిదర్శనంగా ఉన్నాయని అన్నారు…అభివృద్ధికి అహంకారానికి మధ్య ఖమ్మంలో యుద్ధం జరుగుతుందని విజ్ఞులైన ఖమ్మం ప్రజలు ఆలోచించాలని అప్పీల్ చేశారు ..

తుమ్మల మాటలపై రగిలిపోయిన మంత్రి అజయ్

ఖమ్మం నగరాభివృద్దికి ఒక పెద్ద మనిషి అహంకారానికి మధ్య జరిగిన పోరు అని మంత్రి అన్నారు. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జరుగుతున్న పోరాటంలో అభివృద్దే గెలుస్తుంది అని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

నా రాజకీయ జీవితంలో ఇక్కడ కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ పని చేసిన అధికారులైన, చిన్నా, సన్న ఉద్యోగులను సైతం చాలా గౌరవంతో పలకరించానే తప్ప ఎప్పుడూ మాటలు తులనాడలేదన్నారు.

ఇక్కడ ఒక నాయకుడు కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే పోలీస్ లను జీప్ ల ముందు పరిగెత్తిస్తా అంటు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. అప్పుడు అధికారం వచ్చేసినట్లు భావించడం వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.

నన్ను ఖాసిం రజ్వీతో పోల్చడం హాస్యాస్పదం గా ఉందని, ఎక్కడ ఏ అన్యాయం చేశానో.. రజాకార్ల పాలన ఎప్పుడూ చేశానో చెప్పాలన్నారు. నా నిజాయితీ, నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు.. ఎవ్వరిని ఒక్క పైసా అడగలేదు.. ఎవరి దగ్గర ఏమి ఆశించలేదు.. కేవలం అభివృద్ది, సంక్షేమం పై మాత్రమే దృష్టి పెట్టానని పేర్కొన్నారు.

మిమ్మలని నమ్మిన వ్యక్తులను మోసం చేయడంలో మీకంటే దిట్ట ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు..? ఒకప్పుడు నాపై ఒడిపోయిన తుమ్మలను కేసీఅర్ మళ్ళీ దగ్గరకు తీసి మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, పాలేరు ఉప ఎన్నికలో నిలబెట్టి గెలిపించారు.

బీఆర్ యస్ లో పదవులు దర్జాగా అనుభవించి నేడు నిస్సిగ్గుగా ప్రభుత్వంపై ఎలా మాట్లాడగలుగుతున్నారని ప్రశ్నించారు. మీకు పాలేరు టికెట్ ఇవ్వలేదని కేసీఅర్ ని తీడతారా .. మీకు టికెట్ ఇస్తే మంచి ప్రభుత్వం.. ఇవ్వకుంటే కేసీఅర్ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వమా..? గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్ళు కడుగుతా అన్న పెద్ద మనుషి ఖమ్మం ప్రజల కాళ్ళతో ఎంపనో ఆయనకే తెలవాలన్నారు.

Related posts

స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1

Ram Narayana

మిర్చి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

Ram Narayana

Leave a Comment