Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం తప్పదు … మందకృష్ణ మాదిగ…

హైదరాబాద్ లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు తరలి రావాలి.

  • ఎస్సీ వర్గీకరణకు పార్టీలన్నీ నిజాయితీగా మద్దతు ఇవ్వాలి.
  • వర్గీకరణ వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం చెప్తాం.
  • వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ఆమోదించాలి.
  • రాష్ట్రంలో 14 అసెంబ్లీ సీట్లు మాదిగలకు కేటాయించాలి.
  • సత్తుపల్లి కాంగ్రెస్ సీటు మాదిగలకు ఇవ్వాలి.
  • గాడ్ ఫాదర్ లు లేకపోయినా జనమే మా బలగం.
  • ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ.

ఎస్సీ ఏ,బి,సి,డి వర్గీకరణ కోసం హైదరాబాదులో వచ్చే నెలలో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు మాదిగలంతా తరలి రావాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 29 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరగకుండా పోరాడుతున్నామన్నారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతిస్తున్నామంటూనే నిజాయితీగా వర్గీకరణ సాధనకు సహకరించడం లేదని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో దశాబ్దాల కాలంగా వర్గీకరణ పట్ల ఆసక్తి చూపకుండా మాదిగలను వంచిస్తున్నారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసన సభ కు 3 రాజకీయా పార్టీ ల మధ్య ప్రధాన పోటి జరుగుతుందని తెలిపారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ఎస్ సి వర్గీకరణ కు సానుకూలం అనీ చెపుతున్న పార్టీలు.. బాధ్యత ను సంక్రమంగా నెరవేర్చడం లేదని,
అలా చేసి ఉంటే ఇన్నాళ్ళు వర్గీకరణ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదున్నారు.
బీఆర్ యస్ , బీజేపీ , కాంగ్రెస్, అధికారం కోసం తహ తహ లాడుతున్నాయని తెలిపారు.
జూలై 8 న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ సమావేశంలో , అక్టోబర్ 2 న అమిత్ షా వర్గీకరణకు హామీ ఇచ్చారని చెప్పారు.
ఎస్ సి వర్గీకరణ కు సానుకూలం అనీ బహిరంగంగా ప్రకటించి పట్టించు కోవడం లేదని విమర్శించారు.
ఎస్ సి వర్గీకరణ పై బిజెపి మరోకసారి పూర్తిగా ప్రజలకు తెలియ పర్చాలన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉష మెహ్రా కమిషన్ వేశారని, మ్యానిఫెస్టో, తీర్మానం చేసిన కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న వర్గీకరణ సాధనకు డిమాండ్ చేయలేదన్నారు.
అయా జాతీయ పార్టీలు.. నేతలు దీని పై ప్రస్తావన తెచ్చి వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి అందరూ మద్దతు పలకాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
సోనియా గాంధి, రాహుల్ గాంధీ, ఖర్గే కూడా అనుకూలం అయితే పేపర్ పై మాత్రమే ఉంచారని అన్నారు .అధికారంలో ఉన్నప్పుడు, ప్రతీ పక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే వర్గీకరణకు మద్దతు ఎందుకూ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ అధిష్టానం… వర్గీకరణ చేస్తునట్లు ప్రకటించి, పేపర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శీతాకాలం సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పై ప్రస్తావన జరిగి బిల్లు విజయం సాధించేలా రాజకీయ పార్టీలన్నీ అండగా నిలవాలని కోరారు. బి ఆర్ ఎస్ పార్టీ ఎస్ సి వర్గీకరణ అనుకూలమే అనీ చెప్పి మ్యానిఫెస్టోలో పెట్టీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి వదిలేశారన్నారు. వర్గీకరణ విషయం లో కెసిఆర్ బాధ్యత మరచి పొయ్యారని,
వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి విస్మరించారని విమర్శించారు.కాంగ్రెస్, బి ఆర్ ఎస్,బిజెపి మాటలు చెప్పి ఆచరణలో విస్మరిస్తున్నారన్నారు. అధికారంలో ఉండి బిజెపి తీర్మానం చేయలేదని తెలిపారు.

లిక్కర్ కేసులో కవిత కోసం ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి కెసిఆర్ 10 రోజులు ఉన్నారని, ఎస్ సి జాతీ కోసం 1 గంట కూడా కేటాయించలేని బిజీ పని, కూతురు జైల్ కి వెళ్లకుండా ఏమి మతలబు చేశారో ఏమోనని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేని పార్టీలకు మాదిగ జాతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాబా పెరిగిందని, 15 శాతం రిజర్వేషన్లు ప్రకారం రాష్ట్రంలో ఉన్న 19 ఎస్సీ రిజర్వుడు సీట్లలో 14 అసెంబ్లీ సీట్లు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జనరల్ స్థానాలలో కూడా 5 సీట్లు మాదిగలకు కేటాయించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు మాల- 1 మాదిగ -1 ఇచ్చారని, కానీ జనాభా లెక్కల ప్రకారం 2 సీట్లు మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లాలో మాదిగకు ఒక్క సీటు ఇవ్వకుండా అడ్డుకుంటున్న భట్టి ,రేణుక చౌదరి …

భట్టి విక్రమార్క, రేణుక లు ఇద్దరు కలిసి సత్తుపల్లి సీటు మాదిగ లకు సీట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ..కొండూరు సుధాకర్ కు సతుపల్లి లో టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.అలాగే తుంగతుర్తి లో మాదిగలకు టిక్కెట్ ఇవ్వడం లేదని,భట్టి విక్రమార్క నే మాలలకు గాడ్ ఫాదర్ అయ్యి అడ్డుకున్నారని,
వర్దన పేట చెన్నూరు చొప్పదండి లో కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని,
వివేక్ సోదరులకు అన్నకు బెల్లంపల్లి, తమ్ముడు కి చెన్నూరు ఇస్తున్నారని తద్వారా రాష్ట్రం మొత్తం మీద మాదిగలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఘాటుగా విమర్శించారు. తమకు గాడ్ ఫాదర్ లేకపోయినా ప్రజలే తమ బలగమని మాదిగ జనాభా అత్యధికంగా ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో సీట్లను మాదిగలకు కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగలకు అన్యాయం చేసే రాజకీయ పార్టీలకు వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని మందకృష్ణ మాదిగ తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఎస్పి నాయకులు గుండెపాక నరసయ్య,ఎంఎస్పి ఖమ్మం జిల్లా ఇంఛార్జి యాతాకుల రాజన్నమాదిగ, టౌన్ అధ్యక్షుడు తూరుగంటి రాము మాదిగ, క్రాంతి కూరపాటి సునీల్, ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు రాయల రాంబాబు మాదిగ, ఎం ఎస్ పి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ త్వరలో తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడుతుంది: ఎర్రబెల్లి దయాకరరావు

Ram Narayana

ఎల్లుండి కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్… పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

మేము బీఆర్ యస్ కు ఎప్పుడు అంటకాగలేదు …కూనంనేని..

Ram Narayana

Leave a Comment