Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పాలేరు సభలో తుమ్మల ,పొంగులేటి లక్ష్యంగా సీఎం కేసీఆర్ విమర్శలు…!

పాలేరు సభలో తుమ్మల ,పొంగులేటి లక్ష్యంగా సీఎం కేసీఆర్ విమర్శలు…!
డబ్బుమదం తో అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నారు ..
ఆయన్ను గేటు తాకనివ్వకుండా చెయ్యాలి
తుమ్మలకు చేసిన అన్యాయం ఏమిటి …ఇంట్లో కూర్చున్నవాడిని మంత్రిని చేయడమేనా ..?
వెంకట రెడ్డి భార్యకు సీటు ఇద్దామని అనుకుంటే నాకే కావాలని తుమ్మల కోరలేదా ..?
అందరు కలిసి ఆయనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వలేదా
కందాలను మంచి మెజార్టీ తో గెలిపించండి
ఖమ్మంకు దీటుగా అభివృద్ధి చేసుకుందాం ..
అధికారంలోకి వస్తే పాలేరు నియోజకవర్గం మొత్తానికి దళితబంధు

డబ్బు మదంతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నా బహురూపుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు …పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలో బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి మద్దతుగా జరిగిన భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు …ఈసందర్భంగా ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే ఖమ్మంను అనుకుని ఉన్న పాలేరు ను ఖమ్మంకు దీటుగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు . ఉపేందర్ రెడ్డి అడిగిన విధంగా నియోజకవర్గాన్ని మొత్తంగా దళితబంధు అమలు చేసే భాద్యత నాదని అన్నారు …ఒకప్పుడు కరువుకు నిలయమైన పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ప్రాజక్టు ద్వారా సాగు ,తాగునీరు అందించిన ఘనత బీఆర్ యస్ దే అన్నారు .భక్త రామదాసు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నాడు డీజీపీ గా ఉన్న మహేందర్ రెడ్డి సైతం తాను వస్తానని అడిగారని ఎందుకు అని అడిగితె కరువు ప్రాంతమైన మా ప్రాంతానికి నీళ్లు రావడం చూడాలని అన్నారు …

డబ్బు మదంతో పొంగులేటి ….

డబ్బు మదంతో ఒకాయన( పొంగులేటి పేరు ప్రస్తహించకుండా ) ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నారు .కాంట్రాక్టులద్వారా వచ్చిన డబ్బులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. బహురపుగాళ్లతో జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించారు . పొరపాటుగా వాళ్ళను నమ్మి ఓట్లు వేస్తె రైతుబంధు కు రాం..రాం ..దళితబంధు కు జై బీమ్ , కరంటు కథ కంచికేనని తస్మాత్ జాగ్రత అన్నారు . గత రెండు పర్యాయాలు ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే వచ్చింది అయినా బీఆర్ యస్ అధికారంలోకి వచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు .. ఇక్కడ లంబాడీలు అధికంగా ఉన్నారు వారికీ తండాలను పంచాయతీలుగా చేశాం పాలేరు లో 40 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి..వాటిని వారే పరిపాలించుకుంటున్నారు ..

తుమ్మలకు అధికారం అప్పగిస్తే పువ్వాడ తప్ప గుండు సున్నా

తుమ్మల నాగేశ్వరరావు ను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం ఆయనకు ఏమి అన్యాయం చేశాం … పువ్వాడ అజయ్ మీద ఓడిపోయి మూలన కూర్చుంటే తుమ్మలను పిలిచి పాత స్నేహంతో పార్టీలోకి తీసుకోని మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేశాం… వెంకటరెడ్డి మరణంతో అక్కడ ఏకగ్రీవంగా ఆయన భార్యకు టికెట్ ఇద్దామని అనుకున్నాం… అయితే మంత్రిగా ఉన్న తుమ్మల నా నియోజకవర్గం సత్తుపల్లి రిజర్వడ్ అయింది ..అందువల్ల పాలేరులో పోటీచేసే అవకాశం ఇవ్వమని అంటే ఉపఎన్నియల్లో పోటీ పెట్టి అందరం కలిసి 40 వేలకు పైగా భారీ మెజార్టీ తో గెలిపించాం … మంత్రిగా ఆయనకు జిల్లా మొత్తం అప్పగించాం …2018 లో వచ్చిన రిజల్ట్ గుండు సున్నా ..(ఒక్క అజయ్ మాత్రమే గెలిచారు) ఎవరికీ ఎవరు అన్యాయం చేశారు అని కేసీఆర్ అన్నారు …

నాటి తెలంగాణకు ..నేటి తెలంగాణకు పోల్చి చూసుకోండి

కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కోతలు ,వలసల బతుకులే మిగులుతాయని అన్నారు . కొత్తగా రైతుబాందుకు కూడా ఎసరు పెడతామని కాంగ్రెస్ నేతలే అంటున్నారని రైతాంగ సోదరులు ఆలోచించాలని కోరారు .. తాము ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వబోమని సాధ్యాసాధ్యాలపై ఆలోచించి అములు చేసేలా రూపొందించామని తెలిపారు .పూటకొక మాట మార్చుతూ డబ్బు ,మదం అహంకారంతో వచ్చే ఓరిని ఓడించాలని పిలుపునిచ్చారు .

24 ఏళ్ల నాడు తెలంగాణ కోసం బయలుదేరిత్తె పిరికేడు మంది తప్ప వెంటలేరని ఒక్కడినే చేకోరా పక్షిలా తిరిగానని నేడు తెలంగాణ మాట ఉచ్చరించడానికి ఇష్టపడనివాళ్ళు లేసినోడు , లేవలేనివాళ్ళు , కేసీఆర్ నీకు దమ్ముందా …అంటున్నారని ఈ బక్కపలచటివాడు ఏమి తెలంగాణ తెస్తాడనని అవహేళన చేశారని అన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానని గుర్తు చేశారు ..ఇదే ఖమ్మం జైలుకు తరలించిన విషయం గుర్తు చేశారు ..

దళితబంధు తో దళితుల బతుకులు బాగుపడుతున్నాయని కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకు వ్యక్తిగగంగా పోయేది ఏమిలేదని ..ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటామని కానీ పేదల పథకాల మంగళం పడటం ఖాయమని అన్నారు ..

ఉపేందర్ రెడ్డి లాంటి శాసనసభ్యుడు ఉండటం మీ అదృష్టం …

ఉపేందర్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఇంటి మనిషలాగా ఉంది …తన ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉందా…? అని అడిగారు ..నిజంగా ప్రజల మనిషి అనిపించుకున్నారు …ఆయన కోరిన మేరకు దళితబంధు అమలు చేసుకుందామని అన్నారు ..

పాలేరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి…ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి

ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలనీ ,మరో రెండు మండలాలను ఏర్పాటు చేయాలనీ సీఎం కోరారు …తాను ఇక్కడ పుట్టిన బిడ్డగా నిరంతరం మీకు అందుబాటులో ఉన్న సంగతిని గుర్తు చేశారు ..పాలేరు నా ప్రపంచం …పాలేరు నా గమ్యం…ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మీకు అందుబాటులో ఉంటా …నా నెంబర్ ఉందా ..? లేదా …? అని ప్రశ్నించారు ..

ఈ కార్యక్రమంలో మంత్రిపువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర , ఎమ్మెల్సీ తాతా మధు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , వైరా బీఆర్ యస్ అభ్యర్థి మదన్ లాల్ …తదితరులు పాల్గొన్నారు…

ఏమిటా గుసగుసలు …?

Related posts

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మి,

Ram Narayana

కిషన్ రెడ్డి చేత నిరాహారదీక్ష విరమింపజేసిన ప్రకాశ్ జవదేకర్

Ram Narayana

గంగులపై పోటీ చేస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్, బీజేపీలకి బాగా తెలుసు: కేటీఆర్

Ram Narayana

Leave a Comment