Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

కేసీఆర్ జీళ్ళచెర్వు సభకు వెళుతున్న ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి ..పలువురికి గాయాలు …

కేసీఆర్ జీళ్ళచెర్వు సభకు వెళుతున్న ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి ..పలువురికి గాయాలు …
-మృతి చెందిన అనసూర్య కుటుంబానికి అండగా ఉంటామన్న ఎమ్మెల్యే కందాల
-దీనికి బీఆర్ యస్ నైతిక భాద్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్

  • కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి
  • ప్రమాదంలో మృతి చెందిన అనసూర్య మృతదేహాన్ని సందర్శించి నివాళులు
  • బాధిత కుటుంబానికి రూ. 50లక్షలు ఇవ్వాలని డిమాండ్
  • రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ యస్ అధినేత కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు పర్యటన అపస్మృతి చోటు చేసుకుంది….కేసీఆర్ సభకు వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా మరికొంతమందికి గాయాలు అయ్యాయి …దీనిపై ఎమ్మెల్యే కందాల స్పందిస్తూ ఇది దురదృష్టకర సంఘటన ప్రమాదంలో చనిపోయిన అనసూర్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం ,అదే విధంగా గాయపడినవారికి అన్ని రకాల చిత్స అందిస్తామని కందాల అన్నారు .

కాంగ్రెస్ డిమాండ్ ….

కూసుమంచి మండలం నాన్ తండాలో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనకు బీఆర్ఎస్ పార్టీనే నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన అనసూర్య మృతదేహాన్ని కూసుమంచిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని యువనేత పొంగులేటి హర్షరెడ్డితో కలిసి పరామర్శించారు. రక్తమోడిన శరీరాలతో , తీవ్రగాయాల బాధతో రోధిస్తున్న వారితో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై పొంగులేటి శీనన్న కలత చెందారని, పలుమార్లు ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, ఖమ్మం వచ్చాక స్వయంగా ఆయనే వారిని కలిసి పరామర్శిస్తారని తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రజా ప్రతినిధులు, సీఎం స్పందించకపోవడం సరికాదని అన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని, పూర్తిగా అండగా ఉంటామని అభయమిచ్చారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఘటనకు బీఆర్ఎస్ పార్టీ నైతిక బాధ్యత వహిస్తూ చనిపోయిన అనసూర్య కుటుంబానికి రూ. 50లక్షలు, క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ. 10లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకట రెడ్డి, జొన్నల గడ్డ రవి, తమ్మినేని నవీన్, హఫీజ్, బారి వీరభద్రం, సుధాకర్ రెడ్డి, మంకెన వాసు, మదాసు ఉపేందర్, రామి రెడ్డి, మనోహర్, జనార్ధన్ గౌడ్, మచ్చా నాయక్ తదితరులు ఉన్నారు.

Related posts

ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం..

Ram Narayana

మొజాంబిక్ తీరంలో తీవ్ర‌ విషాదం.. ప‌డ‌వ‌ మునిగి 90 మంది జ‌ల స‌మాధి!

Ram Narayana

 మధ్యప్రదేశ్‌లో బస్సు-డంపర్ ఢీ.. మంటలు చెలరేగి 12 మంది మృతి

Ram Narayana

Leave a Comment