- -మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రసాదం పంపిణీ
- -లాక్‌డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఉంటుందని వివరణ
- -రోజంతా కొనసాగుతుందన్న బత్తిని సోదరులు
వచ్చే నెల 8న ఉబ్బసం రోగుల కోసం చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని 8న ఉదయం 10 గంటల నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పంపిణీ ఉంటుందన్నారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని మృగశిర ట్రస్ట్ భవనంలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రసాద పంపిణీ రోజంతా కొనసాగుతుందని వివరించారు.