Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

జనరంజక పాలన కేసీఆర్ కె సొంతం …రాజ్యసభ సభ్యులు వద్దిరాజు….

జనరంజక పాలన కేసీఆర్ కె సొంతం …రాజ్యసభ సభ్యులు వద్దిరాజు….
అందుకే ఆయన్ను మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ..
ఎన్నికలప్పుడు మాయ మాటలతో మభ్య పెట్టేవారిని నమ్మకండి
రాష్ట్రాన్నిఅన్నిరంగాల్లో గొప్పగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దే,
అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించిన ఘనత బీఆర్ యస్ దే
ఈనెల ఐదున కొత్తగూడెం విచ్చేస్తున్న మహానేత కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలుకుదాం,ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం: ఎంపీ రవిచంద్ర

రాష్ట్రంలో జనరంజకపాలన అందించడం ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు . ఆదివారం కొత్తగూడంలో జరగనున్న ప్రజా ఆశ్వీరవాదసభకు వస్తున్నా సీఎం కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పాలకున్నట్లు తెలిపారు .ఈసభను పురస్కరించుకొని కొత్తగూడెం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు , ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, పినపాక, అశ్వారావుపేట ఇంఛార్జిలు సత్యనారాయణ,వెంకటరమణలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికలప్పుడు డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలతో మభ్య పెట్టేవారిని తిప్పికొట్టండని వద్దిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.ఇతర పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుని నియోజకవర్గం ముఖం చూడకుండా హైదరాబాద్ నగరానికే పరిమితమవుతారన్నారు.అందుకు భిన్నంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు,అభ్యర్థులు ప్రతి నిత్యం ప్రజల మధ్యనే ఉంటారని ఎంపీ రవిచంద్ర వివరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించిన మహానేత చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా శాశ్వతంగా కొనసాగితే బాగుంటుందని ఆకాంక్షించారు.”ప్రజా ఆశీర్వాద సభ”లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు ఈనెల మధ్యాహ్నం కొత్తగూడెం విచ్చేస్తున్న తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసీఆర్ కు మనందరం అపూర్వ స్వాగతం పలుకుదామన్నారు.గులాబీ శ్రేణులు, అభిమానులు శ్రేయోభిలాషులు, స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.కేసీఆర్ ను ప్రత్యక్షంగా చూసి, జనరంజకమైన ప్రసంగాన్ని వినేందుకు గాను సుమారు 80,000మంది సభకు హాజరు కానున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.సభికులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.అసెంబ్లీలో అందరి కంటే సీనియర్ సభ్యుడిగా ఉన్న వనమాకు ఇవే చిట్టచివరి ఎన్నికలని, నియోజకవర్గాన్ని 3,000కోట్లతో ప్రగతిపథాన పరుగులు పెట్టించిన వెంకటేశ్వరరావు కారు ఓటేసి ఘన విజయం చేకూర్చాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రజలను కోరారు.

ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావులు సభాస్థలి పరిశీలన..

ఈనెల ఐదవ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగుతుంది.ఈ సభలో బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే ఈ సభ నిర్వహణ, ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జిలు కోనేరు సత్యనారాయణ, ఉప్పల వెంకటరమణలతో కలిసి పరిశీలించారు, పర్యవేక్షించారు.ఏర్పాట్లలో నిమగ్నమైన వారికి ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావులు పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.

Related posts

కష్టపడి రాసిగా పోశాక ఎవరో వస్తే ఊరుకుంటానా?: ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

ప్రతిష్టాత్మకంగా తుక్కుగూడ సభ ..లక్షలాదిగా తరలిరావాలి …మంత్రి తుమ్మల

Ram Narayana

అధికారులపై ఎమ్మెల్సీ తాతా బెదిరింపులు…ఆ వీడియో ఇప్పటిది కాదని ఖండినచిన మధు ..!

Ram Narayana

Leave a Comment