ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ,ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తా…తుమ్మల
ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల కు కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశా
సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశీస్సులు తో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్
నన్ను దీవిస్తున్న ప్రతి అక్కరికి రుణపడి ఉంటా …
నామినేషన్ వేసిన అనంతరం మీడియా తో తుమ్మల …
ఆధునిక ఖమ్మం రూపశిల్పి గా ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తానని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .నామినేషన్ ల మొదటి రోజునే ఆయన ఉదయం ఖమ్మం నియోజకవర్గ ఎన్నికల అధికారికి నామినేషన్ పాత్రలను అందజేచారు ..ఎలాంటి ఆర్బాటం లేకుండా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , సాధు రమేష్ రెడ్డి వెంటరాగా తన నామినేషన్ ఎన్నికల అధికారికి అందించారు .అనంతరం అక్కడ మీడియా తో మాట్లాడుతూ ఖమ్మంలో ప్రజలకు ఏది అవసరం అది గ్రహించి వారి మంచి కోసం మేలుకోసం కక్షలు కార్పణ్యాలు తావులేకుండా , నడుచుకుంటానని అన్నారు . నా సుదీర్ఘ రాజకీయ మజిలీలో ఇది కీలక ఘట్టమని ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుంచి పోటీచేయడం జరుగుతుందని అన్నారు . రాష్ట్రంలో ధర్మబద్ధ , న్యాయబద్ధ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అది ఒక్క కాంగ్రెసుకే సాధ్యమని ప్రజలు గ్రహించి అధికారంలోకి తేబోతున్నారనే విశ్వాసాన్ని తుమ్మల వ్యక్తం చేశారు ….తెలంగాణ రాష్ట్రము ఇచ్చిన.సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని తపన పట్టుదలతో ఉన్నారని ఖమ్మంలో కూడా అధికనిపిస్తుందని అన్నారు. ఖమ్మం ప్రజలను తాను ఊహించినదానికంటే ఎక్కువ మద్దతు పలకడం ఆనందంగా ఉందని అన్నారు . అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయడం ద్వారా తెలంగాణ భవిష్యత్ రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు ….నిరంకుశ అవినీతి ఆప్రజా స్వామిక.పాలనకు వ్యతిరేకంగా ఖమ్మం తో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకం చారిత్రక తీర్పు ఇవ్వాలని తుమ్మల పిలుపు నిచ్చారు ..