Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రజా ఆశ్వీరవాదసభ గేమ్ చెంజర్ …మంత్రి పువ్వాడ

సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రజా ఆశ్వీరవాదసభ గేమ్ చెంజర్ …మంత్రి పువ్వాడ
ఖమ్మంలో గెలుపు ఖాయం… జిల్లాలో బీఆర్ యస్ మంచి ఫలితాలు
సీఎం కేసీఆర్ సభలకు పోటెత్తుతున్న ప్రజలు
ఖమ్మం జిల్లాలో ఇప్పటికి ఐదు సభలు
కేసీఆర్ ముచ్చటగా మూడవసారి సీఎం అవ్వడం ఖాయం

సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రజా ఆశీర్వాదసభ ఒక గొప్ప గేమ్ చెంజర్ ఒక్క ఖమ్మంలోని కాదు రాష్ట్రంలో ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో జరిగిన ఐదు సభలకు జనం పోటెత్తారు ..సీఎం కేసీఆర్ పాలన మళ్ళీ కావాలని కోరుతున్నారు . అందుకే ఖమ్మంలో అనుకున్న దానికంటే అధికసంఖ్యలో ప్రజలు హాజరు కావడం సంతోషదాయకం ..ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని జిల్లా మంత్రి బీఆర్ యస్ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు .. సోమవారం బీఆర్ యస్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఎంపీ నామ నాగేశ్వరరావు తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం ,కొత్తగూడెం సభల్లో సీఎం చేసిన ప్రసంగాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు . ఖమ్మం లో జరిగిన అభివృద్ధి గురించి వివరించిన కేసీఆర్ తన కృషిని గురించి వివరించడం తనకు సంతోషం కల్గించిందని అన్నారు .సీఎం ఖమ్మం అభివృద్ధికి అడగగానే నిధులు ఇచ్చి ప్రొత్సావించారని అన్నారు .సభకు ప్రజలు బారికేడ్లను కూడా తోసుకుంటూ వచ్చి కేసీఆర్ కొద్దీ సేపు మాత్రమే చేసిన ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారని అన్నారు .ఖమ్మం ప్రజలు ఉద్యమకాలం నుంచి కేసీఆర్ కు అండదండలు ఇచ్చారని అన్నారు .

సీఎం కెసిఆర్ “కరటక దమనకులు” అని మాట్లాడారు. నక్క బుద్దులు కలిగిన ఇద్దరి వ్యకులు అనే సంబొదించారు….చిన్నయ్య సూరి అనే కవి చిన్న పిల్లల కోసం కథలు రాసేవారు. వారి కథల్లో మోసగాళ్ళు కోసం స్పష్టంగా వివరించారు….ఆయన రాసే కథలో రెండు గుంట నక్కలు విడిగా ఉండి ప్రజలను మోసం చేసేవి అని.. వర్ణించిన తీరును కేసీఅర్ వివరించారు.
ఆ నక్కల నటన ఎలా ఉండేది అంటే వాటి నటనను చూస్తే ఎవరైనా మోసపోవాల్సిందే. అందువల్ల జిల్లా లో ఉన్న ఇద్దరు మోసగాళ్ల గురించి వారు మాటలు గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ..

మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేశారని అన్నారు .కేసీఆర్ దార్శనికత వల్లనే రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు . రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ,రైతుబంధు , దళిత బంధు రైతుల రుణమాఫీ ప్రాజక్టుల నిర్మాణం ద్వారా సంక్షేమం ,అభివృద్ధిని రెండు కళ్ళ గా భావించి పనిచేస్తున్నారని కొనియాడారు ..అలాంటి వ్యక్తిని తిరిగి సీఎం గా చేసుకోవాలని అన్నారు .ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు …మీడియా సమావేశంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునకుల్లు నీరజ ,మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేతా తదితరులు పాల్గొన్నారు …

Related posts

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటోవాలాల దాడి

Ram Narayana

వైభవంగా వురిమళ్ల ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం

Ram Narayana

ఖమ్మంలో కలిసిన మంత్రులు …కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి వ్యూహం దిశగా అడుగులు…

Ram Narayana

Leave a Comment