మధిర భట్టి ప్రచారంలో కీలకం “మేడం నందిని” ..
రాష్ట్ర పార్టీ కార్యకలాపాలతో బిజీ బిజీ గా భట్టి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే …సీఎం రేసులో భట్టి
కాంగ్రెస్ అధిష్టానం లుక్స్ లో భట్టికి మంచి మార్కులే
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకనేత , సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించారు … తిరిగి నాలుగవసారి గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తున్నారు …అందుకు తగ్గట్లుగానే ప్రచార యంత్రాగాన్ని సిద్ధం చేశారు ..ప్రత్యేకించి ఆయన ప్రచారంలో ఆయన సతీమణి “మేడం నందిని” కీలకపాత్ర వహిస్తున్నారు ..కేవలం ఎన్నికలప్పుడే కాకుండా నిత్యం ఆమె నియోజకవర్గ ప్రజలకు ఆత్మబంధువు అయ్యారు ..తరుచు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల మంచి చెడులను తెలుసుకోవడం ఆమె చేస్తున్నారు …అందువల్ల నియోజకవర్గంలో ఎవరి ఏమిటి అనేది ఆమెకు బాగా తెలుసు …వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే మంచి మనిషిగా ఆమెకు పేరుంది…అమ్మ ఫౌండేషన్ పేరుతో సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు ..కొన్ని కష్టాలను భట్టి కన్నా మేడం కు చెపితే రెస్పాన్స్ బాగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి…ఈనెల 30 వతేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమె మధిరలోనే తన పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య తోకల్సి మకాం వేసి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు…మంగళవారం రోజున దృక్పధం ..మధిరలో ఆమె ప్రచారం చేస్తున్న వీధిలోకి వెళ్లి పలకరించగా తమకు గతంలోకంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చాల బాగుందని అన్నారు … ప్రతి ఇంటివద్ద సాదరంగా ఆహ్వానిస్తూ తమ ఆడపడుచు ఇంటికి వచ్చినంత ఫీల్ అవనున్నారని .కొందరైతే సారె,చీరలు ఇచ్చి బొట్టు పెట్టి మరి పంపుతున్నారని తెలిపారు ..ప్రధానంగా కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల్లో బాగా చర్చనీయాంశంగా ఉన్నాయని అన్నారు …ప్రధానంగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గమపు ,మహిళకు గృహలక్ష్మి పథకం ,రైతు బందు 15 వేలకు పెంచడం , కౌలు రైతులకు 12 వేలు ఇవ్వడం , కూలీలకు 12 వేల రూపాయలు లాంటి పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రజలే అంటున్నారని తెలిపారు ..
శాసన సభ్యుడుగా , ప్రభుత్వ విప్ గా , డిప్యూటీ స్పీకర్ గా రాష్ట్ర స్థాయిలో ఆయన వివిధ పదవులను నిర్వహించారు … రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెలిసిన సమర్ధుడైన నేతగా ఆయనకు పేరుంది… రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ప్రచారం జరుగుతున్న సందర్భంలో నాల్గొవసారి గెలిస్తే ఆయన టాప్ పోస్ట్ లో ఉంటారని మధిర ప్రజలు భావిస్తున్నారు …అందుకే ఆయన పర్యటనలకు మంచి స్పందన లభిస్తుంది..ప్రధానంగా యువత సీఎం ,సీఎం అంటూ నినదిస్తున్నారు ..బోనకల్లు సెంటర్ లో ఒక వ్యక్తిని కదపగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు బాగున్నాయని ,కాంగ్రెస్ సిలిండర్ 500 రూపాలకే అందిస్తామని చెప్పిన తర్వాతనే కేసీఆర్ 400 లకే ఇస్తానని ప్రకటించారని మరి ఇప్పడు అధికారంలో ఉంది వారే కదా ..? ఎందుకు ఇవ్వడం లేదని లాజిక్ పట్టుకోవడం గమనార్హం..
కోమట్లగూడెం గ్రామంలో సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క వారి తనయుడు మల్లు సూర్య విక్రమాదిత్య ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు …
రోడ్ షో లో నందినివిక్రమార్క మాటల్లోనే

అధికార మదంతో దళిత మహిళను,ఆమె కొడుకును అత్యంత కిరాతకంగా లాకప్ లో పడేసి కొట్టి చంపింది బీఆర్ఎస్ ప్రభుత్వం…. చేయని తప్పుకి ఆమెను దారుణంగా కొట్టి చంపారు….మరి నేరం రుజువు అయ్యిందా…మరియమ్మ ఘటనను దేశా వ్యాప్తంగా తీసుకువెళ్ళింది భట్టి విక్రమార్క ….మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని,వారి ఇంటికి రప్పించిన దమ్మున్న నాయకుడు భట్టి విక్రమార్క…
మరియమ్మ ఘటనతో చలించి పోయిన భట్టి విక్రమార్క …దళిత మహిళ కుటుంబాన్ని కనీసం చూడటానికి రాలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నాయకులు అవసరమా?…భట్టి విక్రమార్క పోరాటంతోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దలితులందరికి దళిత బంధు వచ్చింది…దళితుల తరుపున నిరంతరం పోరాటం చేసేది ఒక్క భట్టి విక్రమార్కేనే ….
నిరుద్యోగుల భవిష్యత్ చిద్రం చేసిన బీఆర్ఎస్ కి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు….
ప్రాణాలు అర్పించి సాదించుకున్న తెలంగాణాలో ఎవరి పాలు అయ్యింది.?
పదేళ్లు బీఆర్ఎస్ పాలన మొత్తం మోసం నయ వంచన …ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసి చూపిస్తాం …మహిళకు,రైతులకి,కౌలు రైతులకి, రైతు కూలీలకు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట…
మధిర ఓటర మహాశయులరా రాబోయే భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయండి… మీరు వేసిన ఓటుతో మధిర ప్రజల గౌరవాన్ని భట్టి విక్రమార్క మరింత పెంచుతారు….
మహిళలకు 500 రూపాయలకే సిలిండర్,ప్రతినెల మహిళలకు 2,500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం,మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవన్నీ కలిపి నెలకు 5000 రూపాయల వరకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ప్రకటించిందనీ తెలిపారు.పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామనీ అన్నారు.వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామని,చదువుకునే యువతకు ఐదు లక్షల క్రెడిట్ కార్డు,పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతామని అన్నారు.ప్రతి ఇంటికి 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంటు అందిస్తాం.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.రైతులకు రుణమాఫీ తో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే లు ప్రకటించిన డిక్లరేషన్స్ మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సూర్య విక్రమాదిత్య మాటల్లో …

సూర్య విక్రమాదిత్య మాట్లాడుతూ మధిర ప్రజలు వేసిన ఓట్ల వల్ల భట్టి విక్రమార్క సిఎల్పీ లీడర్ అయ్యారాని రాష్ట్రంలో 1365 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు….
మధిర నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనం,ప్రజలు ఇచ్చిన బలంతో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని అమలు చేయడంలో కీలకంగా ఉండబోతున్నారని సూర్య విక్రమాదిత్య అన్నారు….
రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించి పాలించే వారిగా భట్టి విక్రమార్క ఉంటారాని లేదా పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడిగానైన ఉంటారని అన్నారు.ఈ రెండు లేని వాళ్ళు ఇక్కడ ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అంటూ ప్రత్యర్థి కు చురకలు అంటించారు …
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో భట్టి విక్రమార్క పోరాటం చేస్తే వచ్చింది దళిత బంధు పథకమని గుర్తు చేశారు.మధిర నియోజకవర్గాన్ని ఎప్పుడు పతాక శీర్షికలో ఉంచుతారనీ,మధిర పౌరుషం, గౌరవాన్ని భట్టి విక్రమార్క ఎక్కడ తగ్గించలేదనీ తెలిపారు.హస్తం గుర్తు పై ఓటు వేసి గెలిపించిన మధిర ప్రజల గౌరవాన్ని మరింత పెంచుతారని.మధిర ఓటు వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో మార్పు తీసుకొస్తారని పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.మధిర నియోజకవర్గంలో అధికార పార్టీ డిపాజిట్ గల్లంతవ్వాలినీ అలాగే అపర భగీరథుడు మల్లు భట్టి విక్రమార్క నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అమలు చేసి చూపిస్తుందినీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది….
