Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సిపిఐకి భారీ షాక్ …కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి కౌన్సిలర్ల గుడ్ బై

సిపిఐకి భారీ షాక్ …కొత్తగూడెంలో సిపిఐకి కౌన్సిలర్ల గుడ్ బై
పార్టీ నేత కూనంనేని నామినేషన్ వేస్తున్న రోజునే హైద్రాబాద్ లో ప్రత్యక్షం
కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన సిపిఐ కౌన్సిలర్లు
కౌన్సిలర్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
ఇటీవలనే రహస్య సమావేశం నిర్వహించిన కౌన్సిలర్లు
సాంబశివరావు కు బదులు షాబీర్ పాషా కు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన
తర్వాత పార్టీ నేతల జోక్యంతో సర్దుమనిగిన వివాదం

కాస్తో కూస్తో నిర్మాణం ఉన్నదన్న సిపిఐ పార్టీలో నిర్మాణం కట్టుతప్పింది ..అత్యంత కీలక సమయంలో సిపిఐకి బలంగా ఉన్న కొత్తగూడెంలో మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీకి షాక్ ఇచ్చారు …ఆపార్టీకి గుడ్ బై చెప్పి అధికార బీఆర్ యస్ లో చేరారు .అదికూడా కాంగ్రెస్ తో ఒప్పందంలో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐ కే కేటాయించిన వేళ…. ఆపార్టీకి మింగుడుపడని అంశంగా మారింది..సిపిఐ కి కొత్తగూడెం మున్సిపాల్టీ లో 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు . వారిలో ఆరుగురు పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది . ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం సిపిఐ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నవేళ వారు హైద్రాబాద్ వెళ్లి బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండలు కప్పుకున్నారు …

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ సిద్ధాంతాలు, కెసిఆర్ ఆశయాలు నచ్చి పార్టీలోకి వచ్చే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. వనమా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ రథసారధిగా తెలంగాణ జాతిపితగా కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యావత్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు నచ్చి బిఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా వారు ప్రకటించారు.

అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు రాజకీయాలకు అతీతంగా నిరంతరం చేస్తున్న అభివృద్ధి పనులు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చే వారి నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తామని వారి సారధ్యంలో కొత్తగూడెంలో మా వార్డుల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి ,కౌన్సిలర్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాసరెడ్డి , ఒకటో వార్డు కౌన్సిలర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోయిన విజయ్ కుమార్, 18 వ వార్డు కౌన్సిలర్ పి. సత్యనారాయణ చారి, 16 వ వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి ,30 వ వార్డు కౌన్సిలర్ నేరేళ్ల సమైక్య మరియు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, ఏఐటియుసి పట్టణ కన్వీనర్ పిడుగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related posts

The Workout Plan To Get Ripped Without Breaking A Sweat

Drukpadam

రైతులకు పరిహారం విషయం…టీడీపీపై సుతిమెత్తగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ..

Ram Narayana

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ

Ram Narayana

Leave a Comment