ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ గెలుపే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం …ఎంపీ వద్దిరాజు
తమకు ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు:ఎంపీ రవిచంద్ర
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం మాదే
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం బీఆర్ఎస్ సభాస్థలిని పరిశీలించిన సందర్భంగా ఎంపీ రవిచంద్ర ధీమా
తమకు ప్రత్యర్థి ఎవరనేది,పోటీలో ఉన్న పార్టీలు ఏవనేవి ముఖ్యం కాదని,గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాక, అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు.ఈ పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిన తీరు, విజయవంతంగా అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ, అద్భుతమైన ఎన్నికల మేనిఫెస్టోను ముందు పెడుతూ దూసుకుపోతున్నామని చెప్పారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లక్ష్మీపురంలో సోమవారం జరుగనున్న బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”ఏర్పాట్లను ఎంపీ రవిచంద్ర ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యర్థి ఎవరనేది తాము పట్టించుకోవడం లేదని,అందరికంటే ప్రచారంలో ముందంజలో ఉన్నామని,పదికి పది సీట్లను బీఆర్ఎస్ సునాయాసంగా గెల్చుకుంటుందని ధీమాగా చెప్పారు.ఈ పదితో పాటు రాష్ట్రంలో 90సీట్లను గెల్చుకోవడం, కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం,ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించడం తథ్యమని ఎంపీ వద్దిరాజు వివరించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట బూర్గంపాడు జెడ్పీటీసీ శ్రీలతా రెడ్డి,బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త బత్తినీడి ఆది విష్ణుమూర్తి, బీఆర్ఎస్ నాయకుడు భూక్యా చందూనాయక్ తదితరులు ఉన్నారు.