Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ప్రశాంత ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు…1

నా రాజకీయ జీవితం లో ఇంత రసవత్తర పోటీ ఇంత కసి పట్టుదల ఉన్న ఎన్నికలు చూడలేదని ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . ఇది ధనబలం …జనబలం మధ్య పోటీ …ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోటీ …నిరంకుశ విధానాలకు ..ప్రజాస్వామ్య వ్యవస్థకు మధ్య పోటీఅని తుమ్మల అన్నారు … సోమవారం ఎస్ గార్డెన్ లో జరిగిన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు భాద్యుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని అందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంకావాలని పిలుపు నిచ్చారు ..ఈ ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఓ పక్క ఖమ్మం జిల్లా ఓ పక్కఅన్నట్లుగా ఉందని ,రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ ఉందని అన్నారు . ఏపీలోని భీమవరం లో ఖమ్మం ఎన్నికలపై పందాలు కాస్తున్నారు పందాలు మంచి సంస్కృతి కాదు వాటిని డిస్కరేజ్ చేయాలన్నారు ….

ఖమ్మం పాలేరు పై వందల కోట్లు కుమ్మరించి నాయకులను అధికార పార్టీ కొనుగోళ్లు చేస్తోంది
నన్ను.. పొంగులేటి నీ ఓడించాలని అధికార యంత్రాంగం అంతా వాడుతున్నారు…..రెండు వందల కోట్ల కు పైగా భీమవరం లో పందాలు కడుతున్నారంటే మీ పాలన పనై పోయింది…భౌతిక దాడులకు పాల్పడుతున్నారు ఇదే కొనసాగితే మీ అరాచకాలు చక్ర వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తామనిసభికుల హర్షద్వానాలమధ్య హెచ్చరించారు … తాము మణులు మాణిక్యాలు అడగలే ఖమ్మం జిల్లా ఆత్మ గౌరవం ముఖ్యం అంటున్నాం …ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ,కబ్జాలు , పోలీస్ కేసులు , వేధింపులు లేని సమాజం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు .

జిల్లాకు ఎక్కడ చెడ్డపేరు రానివ్వలేదు …జిల్లా ప్రజల కోసమే పనిచేశా …

ఖమ్మం పౌరుషాల గడ్డ…నలబై ఏళ్ల రాజకీయ జీవితం మీ పరువు ప్రతిష్ట కోసం పనిచేసా…జిల్లాకు చెడ్డపేరు రానివ్వలేదు …జిల్లా ప్రజలకోసమే నా ప్రాణాలు ఫణంగా పెట్టా…నా జీవిత ఆశయం ఒక్కటే సీతారాం ప్రాజక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సెంటు భూమికూడా మిగలకుండా నీళ్లు పారించి రైతుల కళ్ళలో ఆనందం చూడటమే అని గద్గద స్వరంతో అన్నారు .అందుకే రాజకీయాల్లో ఉండాలనుకున్న,ఖమ్మం ప్రజలు శాంతమూర్తులు .. అలాంటి వారు భయంతో బతుకుతున్నారు ,మాట్లాడే స్వేచ్చలేదు …భూములు కొంటె అవి ఉంటాయిపోతాయో గ్యారంటీ లేదు ..కబ్జాలు , ఇసుక మాఫియా ,ల్యాండ్ మాఫియా అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని తిరిగి పోటీచేస్తున్నాని అన్నారు ..

రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం …

మత విద్వేషాలు లేకుండా భారత్ జోడో యాత్ర తో దేశం ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వం కు మద్దతుగా నిలవాలి…రాహుల్ ,సోనియా ఆకాంక్షల మేరకే ఖమ్మంలో పోటీచేస్తున్నానని అన్నారు …నాకు మద్దతు గా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు ధన్య వాదాలు…ప్రత్యేకించి కూరపాటి వెంకటేశ్వర్లు వారి కమిటీ మంచి నిర్ణయం తీసుకున్నది
…..గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం కోసం నాడు టీడీపి నుంచి టీ.అర్.ఎస్ పార్టీలో చేరానాని అన్నారు …జిల్లాలో ఏమి లేని పార్టీని లక్షలాది మందిని సమీకరించా…జిల్లా పరిషత్ , ఖమ్మం కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో విజయం సందించాం … అయినా ఆపార్టీ నాయకుడు వ్యవరించిన తీరు మీకందరికీ తెలిసిందే అని అన్నారు …సీఎం కన్నా పదిసంవత్సరాల ముందే నేను క్యాబినెట్ లు ఉన్నాను …అసంగతి పరిచిపోయి ఎవరో మెదడు తక్కువలు ఇచ్చిన రిపోర్ట్ చదుతున్నారని చురకలు అంటించారు …

గత ఎన్నికల్లో టీ.అర్.ఎస్ ఎమ్మెల్యేల ఓటమిపై తరుచు మాట్లాడటాన్ని తుమ్మల ప్రస్తావిస్తూ లు గత ఎన్నికల్లో. ఒడిపోవడం ఎందుకో వర్కింగ్ నీ ప్రెసిడెంట్ అడుగుఅని అన్నారు ..చారిత్రకమైన ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగారాలన్నారు …ఖమ్మం లో అరాచక అవినీతి అక్రమ కేసులు లేకుండా ప్రశాంత ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు

తుమ్మల ,పొంగులేటి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలవడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు అన్నారు .సమావేశంలో పాల్గొన్న ఆయన
కేసీఆర్ పాపం పండింది….పాపం లో పాలు పంచుకున్న.వారు భాద్యులవుతారు…తాము కూడా కేసీఆర్ వల్ల మోసపోయినవాళ్ల మేనని అన్నారు .ఖమ్మం లో తుమ్మల నాగేశ్వరరావు గెలుపు కోసం సీపీఐ శ్రేణులు ఐక్యం గా పనిచేయాలి…పొత్తు ధర్మం కోసం కాంగ్రెస్ పార్టీ కి సీపీఐ కట్టుబడి పనిచేయాలి…మాకు వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం…కొత్తగూడెం లో నా గెలుపు కోసం తుమ్మల పొంగులేటి ప్రచారం చేస్తూన్నారు…బీ.అర్.ఎస్ ప్రభుత్వం పోవడం ఖాయం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం…సీపీఐ మద్దతు తో కాంగ్రెస్ 70 స్థానాల్లో విజయం సాధించబోతుందని అన్నారు ..జిల్లాలో 10 కి 10 సీట్లు గెలవాలన్న పొంగులేటి మాటలు నిజం కాబోతున్నాయన్నారు ..

సమావేశంలో పాల్గొన్న పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలనీ అందుకు మనమంతా సిద్ధంకావాలని పిలుపు నిచ్చారు …ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మేము బొమ్మలం మాత్రమే అసలు కార్యసురులు మీరే …తుమ్మలగారు గెలుపు పై ఎలాంటి డోఖాలేదు …మౌతూ టాక్ విపరీతంగా ఉంది 20 వేలు ,30 వేలు ,40 వేలు అంటున్నారు …ఇది కార్యకర్తల బలం …మనకు 15 రోజులు మాత్రమే ఉంది … అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు …

Related posts

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

చేతికి జైకొట్టారా …? కారుకు సై అన్నారా…? ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

Ram Narayana

ఖమ్మం ఫలితంపై నామ విశ్వాసం …ఫలితం అనూహ్యంగా ఉంటుందని ధీమా..!

Ram Narayana

Leave a Comment