Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఘనంగా కత్తి నెహ్రు 60 వసంతాల వేడుకలు!

60 వసంతలు పూర్తి చేసుకున్న బహుజన నాయకుడు కత్తి నెహ్రూ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలను సీనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం రేఖల భాస్కర్ గౌడ్ తెలిపారు . మాజీ కో- ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణo యాదవ్ , ఎస్బి ఐటి విద్యాసంస్థల అధినేత ఆర్ జె సి కృష్ణ , బొమ్మ విద్యాసంస్థల అధిపతి బొమ్మ రాజేశ్వరరావు లు కత్తి నెహ్రూ గౌడ్ నివాసం నందు జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు . పూర్వ విద్యార్థి నాయకుడిగా ఎన్ ఎస్ యు ఐ ఫౌండర్ లీడర్ గా , యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు . 1996 డీఎస్సీలో జరిగిన అవకతవకలవల్ల పోరాటానికి నాయకత్వం వహించి . 468 మంది ఉపాధ్యాయ వృత్తికి అర్హత గల నిరుద్యోగులకు ఉపాధ్యాయ నియామకాలు ఇప్పించిన ఘనత కత్తి నెహ్రూ గౌడ్ ది . ఈ దేశంలో కులాలుగా విభజించబడ్డ జాతులను మొదటగా తన గౌడ కులము ని చైతన్యం చేసుకొనుటకు ఉద్యోగుల సంఘమైన గోపా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పేద గౌడ విద్యార్థులకు ప్రోత్సాహకంగా మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చి వారినీ విద్య పై వారికి మక్కువ కల్పించి ప్రోత్సహించారు . ఖమ్మం జిల్లా నిరుపేద గౌడ విద్యార్థులకు హైదరాబాద్ గౌడ హాస్టల్లో వసతి కల్పించడంలో ప్రముఖ పాత్ర వసించారు . తెలంగాణ గౌడ సంఘం ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షుడిగా కత్తి నెహ్రూ గౌడ్ నియామకమైన తర్వాత జిల్లాలో వివిధ మండలాలు విస్తృత స్థాయిలో పర్యటనలు చేసి 12 వేల సభ్యత్వాలు చేయించి వారి యోగం క్షేమాల కోసం కంప్యూటరీకరణ చేయించి రాష్ట్రస్థాయిలోనే ఖమ్మం జిల్లా గౌడ సంఘానికి ప్రముఖ స్థానాన్ని కల్పించారు . మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ సహాయ సహకారాలతో గత ప్రభుత్వంలో 29 గుంటల స్థలాన్ని తెలంగాణ గౌడ సంఘం పేరుపై ప్రభుత్వం కేటాయించడం జరిగింది . తాను పుట్టిన గౌడ కులం తో పాటు తోటి కులాలను కలుపుకొని బుద్ధుడు చెప్పిన మార్గంలో బహుజనుల ఐక్యత కోసం ప్రముఖ బీసీ నాయకులు అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి ఖమ్మం జిల్లా చరిత్రలో బీసీ నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థితికి బహుజన ఐక్య ఫ్రంట్ కృషి చేసింది . బీసీ లోని అన్ని కుల సంఘాలలో పేద విద్యార్థుల కోసం వారి వారి కుల సంఘాల ఆధ్వర్యంలో హాస్టల్లు నిర్మాణం చేయించడం జరిగింది . ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబాటు తనం ఉన్న అందరితో స్నేహభావంతో ఐక్య పోరాటాలు చేయడం జరిగింది . వీటి ఫలితంగా రాష్ట్రంలోని గౌడ సంఘం మరియు బీసీ సంఘాలలో “కత్తి”కి ప్రత్యేక స్థానం ఏర్పడింది . కూరాకుల నాగభూషణం యాదవ్ మాట్లాడుతూ కత్తి నెహ్రూ గౌడ్ బహుజనుల ఐక్యత కోసం నిరంతరం మాకు వినూతన సలహాలిస్తూ బీసీల నాయకత్వాన్ని ఖమ్మం జిల్లాలో బలోపేతం చేశారు . ఆర్ జె సి కృష్ణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో బహుజన సంఘాల నాయకుల ఐక్యత కోసం బహుజన ప్రజల చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించారు . ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా పూలే విగ్రహ స్థాపన కోసం విశేష కృషి చేశారు . పూలేని పెరియార్ ని ఖమ్మం ప్రజలకి పరిచయం చేశారు . బొమ్మ రాజేశ్వర రావు మాట్లాడుతూ బహుజనుల నాయకత్వం బలపడుట కోసం నెహ్రూ గారు చొరవ తీసుకోవాలని అన్నారు . తెలంగాణ అడ్వకేట్స్ చైర్మన్ బిచ్చల తిరుమలరావు గౌడ్ మాట్లాడుతూ కత్తి నెహ్రూ గౌడ్ కుంబ చరిత్ర త్యాగాలమయం అని కొనియాడారు . సుంకర శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కత్తి నెహ్రు బహుజనుల చైతన్యం కోసం వారి నాయకత్వం బలపడడానికి గత 25 సంవత్సరాల నుండి అనేక శ్రమలకు ఓర్ఛి చేసిన కృషి నేడు ఒక బహుజన నాయకుడి జన్మదిన కార్యక్రమం గొప్పగా జరగడానికి ప్రేరణ కలిగింది . ఈ సందర్భంగా నెహ్రూ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు . పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి మాట్లాడుతూ కత్తి నెహ్రూ గౌడ్ అన్న మంచి సామాజిక స్పృహ గల నాయకుడు . వారి భావి జీవితం కూడా బహుజనుల హక్కుల కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు . జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ నా తమ్ముడు కత్తి నెహ్రూ గౌడ్ క్రమశిక్షణ తో జిల్లా రాష్ట్ర కేంద్ర నాయకుల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు అని ఆశీర్వదించారు . సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ కత్తి నెహ్రూ విద్యార్థి దశ నుండే సామాజిక స్పృహ కలిగిన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అవి నేడు నిరూపమయ్యాయి అని అన్నారు . ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు విక్రమ్ , సీనియర్ నాయకులు నరసయ్య వారి సతీమణి మల్లిక , కల్లు గీతా కార్మిక సంఘ అధ్యక్షులు బోడపట్ల సుదర్శన్ , పిఆర్టియు ఎమ్మెల్సీ పూల రవీందర్ , జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వరరావు (వైవీ) , టిపిటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మనోహర్ రాజు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ కుమార్ , యుటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం రాజశేఖర్ గౌడ్ , టీఎస్ పిటిఏ రాష్ట్ర అధ్యక్షులు షౌకత్ అలి , ప్రముఖ ఖమ్మం నగర డాక్టర్లు బోలికొండ శ్రీదేవి , శ్రీనివాసరావు గౌడ్ , రక్ష హాస్పిటల్ అధినేత జీవ , ప్రముఖ చెస్ట్ స్పెషలిస్ట్ గోపగాని సురేందర్ గౌడ్ , ప్రముఖ ఐ స్పెషలిస్ట్ మీనాక్షి హాస్పిటల్స్ డాక్టర్ శ్రీధర్ గౌడ్ , ప్రముఖ జనరల్ ఫిజీషియన్ రాంప్రసాద్ గౌడ్ , ప్రముఖ ఇఎన్ టి డాక్టర్ ప్రవీణ్ గౌడ్ , చిత్తలూరి రవికుమార్ వారి కుటుంబం , గౌడ సంఘం సీనియర్ నాయకులు , తెలంగాణ గౌడ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చిత్తలూరి నర్సయ్య గౌడ్ , శ్రీ రామకృష్ణ , పోతగాని కృష్ణారావు గౌడ్ , బోలగాని శ్రీనివాస్ గౌడ్ , అమర గాని వెంకన్న గౌడ్ , జిల్లా గోపా అధ్యక్షులు గుడిద శ్రీనివాస్ రావు గౌడ్ , నగర అధ్యక్షులు గునుగుండ్ల శ్రీనివాస్ గౌడ్ , నూతనంగా తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా సురేష్ , నియమించనైనది . టిటిసి 84 – 85 క్లాస్మేట్ నిర్మల కుటుంబ సభ్యులు పెద్దన్నయ్య కత్తి చంద్రశేఖర్ గౌడ్ , కత్తి జయప్రద , ఉమామహేశ్వరరావు గౌడ్ , చెల్లి ఉత్సవాయి విజయ మంగారావు గౌడ్ , కత్తి వాణి , శరత్ చంద్ర గౌడ్ , గండు యాదగిరి గౌడ్ , ప్రధాని వెంకన్న గౌడ్ , జడ్పీటీసీ దుర్గా , రాష్ట్ర అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల రవికుమార్ , కాంగ్రెస్ నాయకుడు వడ్డే బోయిన శంకర్ రావు గౌడ్ , కట్టేకొల వెంక్కన్న గౌడ్ , బోడపట్ల నాగేశ్వర్రావుగౌడ్ , బీజేపీ యువ మొర్చా జిల్లా అధ్యక్షుడు వీరబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమ నిర్వాహకులు. తెలంగాణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి మార్గం లింగయ్య గౌడ్ ,మిత్రుడు శ్యామ్ , తమ్ముడు సతీష్ , సోమరాజు , పెరుగు వెంకటరమణ యాదవ్ లు ఈ కార్యక్రమం జయప్రదం అవ్వడానికి ముఖ్య కారకులు అయ్యారని పేర్కొన్నారు .

Related posts

పాలేరులో కందాల వ్యూహాత్మక ప్రచారం …

Ram Narayana

త్యాగానికి ప్రతీక బక్రీద్‌…మాజీఎంపీ నామ

Ram Narayana

ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్…ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన

Ram Narayana

Leave a Comment