Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

 బీజేపీ ‘ఇంద్రధనుస్సు’ మేనిఫెస్టోలో 7 ప్రధాన హామీలు… ఉచిత విద్య, వైద్యం కూడా

  • మేనిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
  • ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీతో మేనిఫెస్టోను ప్రకటించనున్న బీజేపీ
  • రైతులకు మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్ రెట్టింపు

బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోకు ఇంద్ర ధనుస్సు అని నామకరణం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా… అందరూ ఆమోదించేలా ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు దీటుగా బీజేపీ ‘ఇంద్రధనుస్సు’ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. ఈ మేనిఫెస్టోలో ఏడు ప్రధాన అంశాలపై బీజేపీ హామీ ఇస్తోందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీతో మేనిఫెస్టోను ప్రకటించనుంది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, సామాన్యులు, రైతులకు లబ్ధి చేకూర్చే అంశాలతో రూపొందించారని అంటున్నారు. వరికిమద్దతు ధరను రూ.3100 పెంచే యోచన చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షలను రూ.10 లక్షల వరకు పెంచే ఆలోచన చేస్తోంది.

Related posts

కేసీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నారు: తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

నల్గొండ సభలో కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

Ram Narayana

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Ram Narayana

Leave a Comment