ఖమ్మంలో పువ్వాడ, తుమ్మల ఒకేచోట తళుక్కుమన్నవేళ ..అరుదైన దృశ్యం..
ఎడమొఖం పెడముఖంతో నేతలు…
ముస్తఫానగర్ లో తారసపడిన ఇరువురు నేతలు
పోటాపోటీగా కార్యకర్తల నినాదాలు
తుమ్మల ప్రసంగం …అజయ్ ర్యాలీతో దద్దరిల్లిన ముస్తఫానగర్
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోనే హాట్ సీట్లలో ఒకటిగా పేరున్న ఖమ్మం అసెంబ్లీ ప్రచారం లో కొత్తపుంతలు తొక్కుతున్నారు కాంగ్రెస్ ,బీఆర్ యస్ అభ్యర్హ్తులు …ఢీ…అంతే ఢీ అంటే సవాళ్లు ప్రతిసవాళ్ళతో ఖమ్మం కురుకేత్రాన్ని తలపిస్తున్నసంగతి తెలిసిందే ..కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు …బీఆర్ యస్ నుంచి పోటీచేస్తున్న పువ్వాడ అజయ్ లు మాటల తూటాలతో విఠలాచార్య సినిమా ను తలపిస్తున్నారు ..
ఈక్రమంలోని ఖమ్మం ఎన్నికల ప్రచారంలో బుధవారం ఒక అరదైన సంఘటవ చోటుచేసుకున్నది. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముస్తఫానగర్ లో ప్రచారం నిర్వహించి ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు ..అదే సమయంలో అటువైపే బీఆర్ యస్ అభ్యర్థి పూవ్వాడ అజయ్ కుమార్ ర్యాలీగా ప్రచారానికి వచ్చారు…. ఇంకేముందు రెండు పక్షాలు ఒక్కచోట మోహరించినట్లైంది … ఎవరు తగ్గేదే లేదన్నట్లుగా ఎవరి కార్యక్రమంలో వారు సీరియస్ ఉన్నారు …ఖమ్మంలో ప్రచారం హోరెత్తుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పోలీసులు ఇద్దరి ప్రచారాలకు ఒకే సమయం ఇవ్వడం విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంటుంది…అయితే పోలీసులు ఇచ్చిన సమయంలోనే అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారా…లేదా అనే మీమాంస ఉంది…ఏదైనా ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన భాద్యత పోలీసులదే అవుతుంది..
ఇటీవల ఇద్దరి మద్య ఎన్నికల ప్రచారంలో మాటలు తూటలై పేలుతున్నవేళ, రెండు శిబిరాలు ఒకే చోట తారసపడటం అసక్తిగా మారింది .. అక్కడ ఏమి జరగబోతుంది అనే దానిపై అందరు చర్చించుకోవడం ఆసక్తిని రేకెత్తించింది … ఒకరిని ఒకరు చూసు కుంటారా …? చిరునవ్వులు చిందిస్తారా …? పలకరించుకుంటారా …? అని కళ్ళకు వత్తులు పెట్టుకొని చూసిన అక్కడ చేరిన వారికీ పువ్వాడ అజయ్ , తుమ్మల వైపు తలకుడా తిప్పకుండా అటువైపు తిప్పి వెళ్లిపోగా , తుమ్మల అక్కడే తన ప్రసంగాన్ని కొనసాగించడం కొసమెరుపు …