Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ తోనే మైనార్టీల సంక్షేమం…

కాంగ్రెస్ తోనే మైనార్టీల సంక్షేమం…

ఖమ్మం రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. పాలేరు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ.. స్థానిక వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలోని మసీదు నుంచి శుక్రవారం నమాజ్ పూర్తి చేసుకుని వస్తున్న ముస్లిములను మసీదు సమీపంలో కలిశారు.
పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..: బీ ఆర్ ఎస్ , బీ జే పీ రెండూ ఒకటే నని విమర్శించారు. మీ శీనన్న ఎప్పుడూ అండగా ఉంటారని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామని వివరించారు.
స్థానిక ముస్లింల హర్ష0..: పలువురు ముస్లిoలు మాట్లాడుతూ..తామంతా పొంగులేటి శీనన్నకే ఓటేస్తామని, పాలేరు నుంచి పోటీ చేయడం అదృష్టమని ఆనంద0 వ్యక్తం చేశారు. భారీ మెజారిటీ అందిస్తామని ప్రకటిoచారు. ఈ కార్యక్రమంలో మజీద్ మౌలానా ఆరిఫ్, సీపీఐ జిల్లా నాయకులు దండి సురేష్ , హుస్సేన్, అబ్దుల్ షుకూర్, ఎస్ కే.పాషా, పఠాన్ అజీమ్ (జుల్లీ) తదితరులు పాల్గొన్నారు

Related posts

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్!

Drukpadam

పక్క రాష్ట్రాల క్యాబ్ లు మా పొట్ట కొడుతున్నాయి.. పోలీసులకు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు!

Drukpadam

జగన్ ప్రభుత్వం తెచ్చిన ఇంగ్లీష్ మీడియం జి ఓ రద్దు చేయాలన్న .. జస్టిస్ ఎన్వీ రమణ

Ram Narayana

Leave a Comment