ఖమ్మంలో ధనస్వామ్యని ఓడించండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి.
-సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ పిలుపు. యర్రా.శ్రీకాంత్, నియోజకవర్గ వ్యాప్తంగా విసృతంగా ప్రచారం.
ఖమ్మంలో ధనస్వామ్యని ఓడించండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండని సీపీఎం అభ్యర్ధి యర్రా శ్రీకాంత్ ప్రజలకు పిలుపునిచ్చారు…. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ డివిజన్లలో సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ ప్రజలకు అభివాదం చేస్తూ ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తు ప్రచారంలో దూసుకుపోతున్నాడు.సీపీఎం కార్యకర్తలు పూలమాలలతో పూలువేసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా యర్రా.శ్రీకాంత్ మాట్లాడుతూ బి.ఆర్.యస్,కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి భయంతో ప్రజలకు ఓటుకి నోటు ఇచ్చి అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.ఖమ్మంలో సీపీఎం అధ్వర్యంలో నిరంతరం ప్రజలను అంటిపెట్టుకొని పోరాడింది సీపీఎం అన్ని, టూ టౌన్ లో మామిళ్ళగుడెం అండర్ రైల్వే బ్రిడ్జి, కొత్త బస్టాండ్ అవినీతి, రోడ్లు, డ్రైనేజీ అనేక రకాల సమస్యలపై నిరంతరం పోరాడింది సీపీఎం అన్ని అన్నారు.ఖమ్మంలో రెండు కార్పొరేట్ శక్తులు ఎన్నికలలో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని, వారు ఎప్పుడైన ప్రజా సమస్యలపై పోరాడేరా అన్ని ప్రజలు ఆలోచించి నిత్యం ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేస్తున్న నన్ను గెలిపించాలని కోరారు.నేను సామాన్యుడిని అన్ని గత 35 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమంలో వారి సమస్యలపై పోరాడుతూ,ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు.గత నలభై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీలో ఉంటూనే అనేక పోరాటాలు ప్రజల సమస్యల కోసం కృషి చేశానని తెలిపారు.మీరందరూ నాకు ఓట్లు వేసి గెలిపించగలరని ప్రజలను కోరారు.ఖమ్మంలో ప్రశ్నించే గొంతుక సీపీఎంకే ఒట్టేయండి అన్ని ఆయన పిలుపునిచ్చారు.ఏనాడూ ప్రజా సమస్యలపై స్పందించని, పోరాడని బి.ఆర్.యస్,కాంగ్రెస్ అభ్యర్దులు ఎన్నికలలో డబ్బుతో అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారని,ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండ నాపై గెలిచే దమ్ము బి.ఆర్.యస్,కాంగ్రెస్ అభ్యర్థులకు ఉందా అన్ని సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.ఈ కార్యక్రమలలో ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, జిల్లా నాయకులు యర్రా.శ్రీనివాసరావు, మీర,వన్ టౌన్ కార్యదర్శి జబ్బార్,హవేలీ కార్యదర్శి డి.తిరుపతిరావు, రఘునాదపాలెం మండల కార్యదర్శి యస్.నవీన్ రెడ్డి,త్రి టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీను,టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల.సుదర్శన్,అర్బన్ కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.