మంత్రి తుమ్మల చెక్కిన శిల్పం మంచుకొండ ఎత్తిపోతల పథకం
ఖమ్మంజిల్లా అభివృద్ధి ప్రధాతగా ,అపరభగీరధుడుగా పేరున్న తుమ్మల తన మనుసులోనుంచి పుట్టిన ఆలోచన మేరకు మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడమే కాకుండా దాన్ని పూర్తీ చేసి రైతులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ..మంచుకొండ ఎత్తిపోతల పథకం ఆయన చెక్కిన శిల్పమే అనడంలో సందేహంలేదు …నీరు లేక కేవలం వర్షాభావం పై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇది ఒక గొప్పవరంగా మారనుంది …ఖమ్మంనికి కూతవేటు దూరంలో ఉండి వానాకాలం పంటలు మాత్రమే పండిస్తున్న రైతులు ఇక నుంచి బంగారు పంటలు పండించే అవకాశం దక్కింది ..మూడు పంటలు పండించేందుకు నీరు ఇస్తామని తుమ్మల అనడంపై రైతులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు ..మంచుకొండ ఇక మారినకొండ కాబోతుందని సంబరపడుతున్నారు …
మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రైతులు పెద్ద ఎత్తున హాజరు అయ్యేందుకు సిద్ధమైయ్యారు …రైతుల సమక్షంలో ఈ పథకాన్ని తుమ్మల చేతులమీదుగా ప్రారంభించనున్నారు ..రైతులు లాభసాటి పంటలు పండించుకునే అవకాశం ఉంది .ఆయిల్ ఫామ్ వైపు ద్రుష్టి సారించాలని స్వయానా రైతు అయినా మంత్రి తుమ్మల అనేకసార్లు రైతులను కోరారు .
Save or share this story as a newspaper-style Epaper Clip: