Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో… కాంగ్రెస్ పార్టీకే మొగ్గు!

  • తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో హస్తం హవా…కారు బేజారు …! అవి తప్పు అంటున్న కేటీఆర్
  • 70 ప్లస్ తో మాదే అధికారం …2018 ఇదే విధంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి..
  • కామారెడ్డి లో కేసీఆర్ ఓడిపోతున్నారన్న రేవంత్ రెడ్డి
  • ఎగ్జిట్ పోల్స్ అన్ని మాకే అనుకూలం …రేవంత్
  • గజ్వేల్ లో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఈటెల
  • నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఓటింగ్
  • సందడి చేస్తున్న ఎగ్జిట్ పోల్స్
  • అధికార బీఆర్ఎస్ కు రెండో స్థానం
  • ఎట్టకేలకు తెలంగాణ శాసనసభకు గురువారం ఎన్నికల ముగిశాయి…ఒకటిఅరా మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే ఆధిక్యత ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి…అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని రబ్బిష్ అంటూ బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో కొట్టి పారేశారు ..2018 ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంటూ ఉదార గొట్టారు …కానీ జరిగిందేమిటి చాల కంఫర్ట్ గా అధికారంలోకి వచ్చాము …ఈసారి కూడా కొన్ని సీట్లు తగ్గినా మాదే అధికారం మాకు 70 ప్లస్ సీట్లు గ్యారంటీ అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు …
  • కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ..ఆయన మీడియా తో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మేము అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు …
  • బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని …అది అక్కడకు వచ్చి చూసిన వాళ్లకు అర్ధం అవుతుందని అన్నారు ..

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక, పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. దాదాపు తెలంగాణలో సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే మొగ్గుచూపుతుండడం విశేషం. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీజేపీ కంటే ఇతరులకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా జనసేన పార్టీ ఊసు ఎత్తలేదు.

వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు…

తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య- 119

ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే…

కాంగ్రెస్- 58 నుంచి 67 స్థానాలు
బీఆర్ఎస్- 41 నుంచి 49 స్థానాలు
బీజేపీ- 5 నుంచి 7 స్థానాలు
ఇతరులు- 7 నుంచి 9 స్థానాలు

చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్…

కాంగ్రెస్- 67 నుంచి 78 స్థానాలు
బీఆర్ఎస్- 22 నుంచి 31 స్థానాలు
బీజేపీ- 6 నుంచి 9 స్థానాలు
ఎంఐఎం- 6 నుంచి 7 స్థానాలు

సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్…

కాంగ్రెస్- 65 స్థానాలు
బీఆర్ఎస్- 41 స్థానాలు
బీజేపీ- 4 స్థానాలు
ఇతరులు- 9 స్థానాలు

సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్…

కాంగ్రెస్-56 స్థానాలు
బీఆర్ఎస్- 48 స్థానాలు
బీజేపీ- 10 స్థానాలు
ఇతరులు- 5 స్థానాలు

పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్…

కాంగ్రెస్- 65 నుంచి 68 స్థానాలు
బీఆర్ఎస్- 35 నుంచి 40 స్థానాలు
బీజేపీ- 7 నుంచి 10 స్థానాలు
ఇతరులు- 6 నుంచి 9 స్థానాలు

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్…

కాంగ్రెస్- 48 నుంచి 64 స్థానాలు
బీఆర్ఎస్- 40 నుంచి 55 స్థానాలు
బీజేపీ- 7 నుంచి 13 స్థానాలు
ఎంఐఎం- 4 నుంచి 7 స్థానాలు

Related posts

ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ఏ పార్టీకి ఎన్ని సీట్లు…!

Ram Narayana

ఎన్నికల ఫలితాలు సినిమా థియేటర్లలో లైవ్!

Ram Narayana

ఎగ్జిట్ పోల్ ఫలితాలపై స్పందించిన సోనియాగాంధీ…!

Ram Narayana

Leave a Comment