Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. బీజేపీ వైపు రాజస్థాన్ మొగ్గు.. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి

  • రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటున్న జన్‌ కీ బాత్
  • మధ్యప్రదేశ్‌లో హోరా హోరీ పోరు తప్పదంటున్న సర్వేలు
  • 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • ఛత్తీస్‌గడ్, మిజోరాం ఎగ్జిట్ పోల్స్

తెలంగాణలో పోలింగ్ ముగియడంతో 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన అంచనాలను ప్రకటించాయి. ఆ అంచనాలను పరిశీలిస్తే..

మధ్యప్రదేశ్:                బీజేపీ        కాంగ్రెస్        బీఎస్‌పీ 

జన్‌ కీ బాత్ –                100-123        102-125        0
రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్        118-130        97-107        0
టీవీ9 భారత్ వర్శ్            106-116        111-121        0

రాజస్థాన్:                    బీజేపీ        కాంగ్రెస్        బీఎస్‌పీ

జన్‌ కీ బాత్ –                100-122        62-85        0
రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్        100-110        90-100        0

ఎగ్జిట్ పోల్ అంచనాలను గమనిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. సర్వే సంస్థలన్నీ బీజేపీకి కాస్త  
మొగ్గు చూపించినప్పటికీ ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీకి అవకాశాలున్నాయంటూ సర్వే సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒడిదొడులకు ఎదురవడం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. అధికారానికి కావాల్సిన మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని లెక్కగట్టాయి.

ఛత్తీస్‌గడ్, మిజోరాంలలో ఎవరు గెలుస్తున్నారు? ఎగ్జిట్ పోల్ ఫలితాలివే…!

  • చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ దాటుతుందంటున్న మెజార్టీ సర్వేలు
  • మిజోరాంలో రెండు పార్టీల మధ్య పోటాపోటీ
  • బీజేపీకి రెండు… కాంగ్రెస్‌కు రెండు రాష్ట్రాలు
Chhattisgarh Exit Polls 2023 Congress is winning

నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. దీంతో సాయంత్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్ గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో కాంగ్రెస్‌కు అవకాశాలు ఉన్నట్లు వెల్లడవుతోంది.

ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా…

టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 33 ( ± 8 సీట్లు)
కాంగ్రెస్: 57 (± 8 సీట్లు)
ఇతరులు: 00 (± 3 సీట్లు)
మొత్తం సీట్లు: 90

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 34-45
కాంగ్రెస్: 42-53
మొత్తం సీట్లు: 90

టీవీ 5 ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 29-39
కాంగ్రెస్: 54-66
మొత్తం సీట్లు: 90

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 36-46
కాంగ్రెస్: 40-50
మొత్తం సీట్లు: 90

ఇండియా  TV-CNX ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 30-40
కాంగ్రెస్: 46-56
ఇతరులు: 3-5

ABP న్యూస్ సీవోటర్ సర్వే (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 36-48
కాంగ్రెస్: 41-53
మొత్తం సీట్లు: 90

మిజోరాం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా…

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు (మిజోరాం)

MNF: 10-14
ZPM: 15-25
కాంగ్రెస్: 5-9
బీజేపీ: 0-2
మొత్తం సీట్లు: 40

ఇండియా  TV-CNX ఎగ్జిట్ పోల్ ఫలితాలు (మిజోరాం)

MNF: 14-18
ZPM: 12-16
కాంగ్రెస్: 8-10
బీజేపీ: 0-2
మొత్తం సీట్లు: 40

Related posts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో… కాంగ్రెస్ పార్టీకే మొగ్గు!

Ram Narayana

కేవలం 32 ఓట్లతో గట్టెక్కిన బీజేపీ అభ్యర్థి

Ram Narayana

లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ప్రజల నాడి ఏం చెబుతోందంటే…!

Ram Narayana

Leave a Comment