తెలంగాణ రాజకీయ వార్తలు ..

ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా… ఆమోదించిన గవర్నర్ తమిళిసై

  • తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా సమర్పణ
  • ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్
  • 64 చోట్ల గెలిచి మేజిక్ ఫిగర్ (60) సాధించిన కాంగ్రెస్

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆయన తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ చేరుకున్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల విజయం సాధించి, మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలవడం లేదా ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ రావడంతో కేసీఆర్ రాజీనామాను సమర్పించారు.

Related posts

మూసీ ప్రాజెక్టు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Ram Narayana

తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ: కామారెడ్డి సభలో మోదీ

Ram Narayana