Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు: రేవంత్ రెడ్డి ట్వీట్

  • సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలైందన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ ఆడబిడ్డల మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని వ్యాఖ్య
  • తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు అన్న ముఖ్యమంత్రి

“తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం మేం చెప్పిన కార్యాచరణ మొదలైంది… తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సందర్భంలోని ఫోటోలను ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీలు ఆ ఫొటోల్లో ఉన్నారు.

Related posts

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!

Ram Narayana

నియంతృత్వ ధోరణిని తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై

Ram Narayana

జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బిజీ బిజీ!

Ram Narayana

Leave a Comment